Corn Health Benefits: వర్షం కాలం ప్రారంభం కాగానే వాతావరణం కలుషితం అవుతుంది. దీంతో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వానలు పడుతుండగా బయటి చిరుతిళ్లు తగ్గించడం మంచిది. కానీ ఇంట్లో రుచికరమైన ఆహారం లభించదు. పైగా ఆయిల్ ఫుడ్ ను అవైడ్ చేయాలి. ఇలాంటి సమయంలో పీచు పదార్థం ఉండే మొక్కజొన్న తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొక్కజొన్నలో ఉండే పీచు పదార్థం శరీరానికి అధికమైన శక్తిని అందిస్తుంది. అసలు ఈ కాలంలో మొక్కజొన్న తినకపతే ఎంత నష్టపోతారో తెలుసా?
మొక్కజొన్నలో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పీచు పదార్థం శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.ఒక్క మొక్కజొన్న పొత్తులో 900 మైక్రోగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తుంది. వీటిని తరుచూ తినేవారిలో చూపు స్పష్టంగా ఉంటుందని ఓ అధ్యయయనంలో తేలింది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే కంటి సమస్యలు ఏవి దరిచేరకుండా ఉండాంలే మొక్కజొన్న పొత్తులను తినవచ్చు.
మొక్కజొన్నలో ఉండే పోషకాలతో ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని పీచు పదార్థం త్వరగా జీర్ణం కాదు. కానీ ఇది కరిగిన తరువాత రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్తను సరిచేస్తుంది. మొక్కజొన్నలో ఉండే పీచు ప్రీయాటిక్ గా పనిచేసి బ్యాక్టీరియా ఎదుగుదలకు తోడ్పతుతుంది. ఇవి పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. మొక్కజొన్నలో ఉండే ఫైటో స్టెరాల్స్ అనే సహజ వృక్ష పదార్థంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ కూడా ఉంటుంది.
మొక్కజొన్న పొత్తులు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా రుచికరంగా ఉంటాయి. ఇందులో సహజమైన చక్కెర నిల్వలు ఉంటాయి. ఇవి మంచి టెస్టీని ఇస్తాయి. వీటిని కాల్చి, ఉడకబెట్టి ఎలాగైనా తినొచ్చు. కొందరు వీటిని గ్రైండ్ చేసి రుచికరమైన పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని తినడం వల్ల తక్షణ ఎనర్జీ కూడా ఇస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే పోషకాలు మెండుగా ఉన్నాయని అదేపనిగా ఎక్కువ మోతాదులో తీసుకున్న ప్రమాదలమే చిన్న పిల్లలకు తగిన మోతాదులో మాత్రమే అందించాలి. ఎక్కువగా తీసుకుంటే స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.