https://oktelugu.com/

Balakrishna- Sridevi: బాలకృష్ణ, శ్రీదేవిలు కలిసి జంటగా నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణ చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. ఎన్టీఆర డైరెక్షన్లో1974లో వచ్చిన ‘తాతమ్మ కల’అనే చిత్రంలో మొదటిసారిగా కనిపించాడు. ఆ తరువాత వివిధ పాత్రల్లో నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 14, 2023 / 10:48 AM IST

    Balakrishna- Sridevi

    Follow us on

    Balakrishna- Sridevi: అతిలోకి సుందరి శ్రీదేవి మన మధ్య లేకున్న ఆమె జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలుగు గడ్డకు చెందిన ఈమె ఆ కాలంలోని పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన శ్రీదేవి ఆ తరువాత హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అలరించింది. తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవి తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి తెరపై కనిపించింది. అయితే నందమూరి బాలకృష్ణ తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరు కలిసి నటించకపోవడానికి కారణమేంటి? అని ఆడియన్స్ కు ఇప్పటికీ సందేహమే. ఇటీవల ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. కొన్ని సినిమాల్లో బాలకృష్ణ, శ్రీదేవి కలిసి నటించడానికి రెడీ అయ్యారు. కానీ అనూహ్యంగా ఆ సినిమాలు గురించి తెలుసుకుందాం.

    సీనియర్ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణ చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. ఎన్టీఆర డైరెక్షన్లో1974లో వచ్చిన ‘తాతమ్మ కల’అనే చిత్రంలో మొదటిసారిగా కనిపించాడు. ఆ తరువాత వివిధ పాత్రల్లో నటించారు. 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఎంతో మంది హీరోయిన్లతో బాలకృష్ణ నటించారు. తన సినిమాల్ల చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రాశి లాంటి వారితోనూ బాలకృష్ణ నటించారు. కానీ అందాల సుందరి శ్రీదేవితో మాత్రం నటించలేదు.

    అయితే 1987లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలకృష్ణ, శ్రీదేవిలతో కలిసి ‘సామ్రాట్ ’నే సినిమా తీయాలని ప్రకటించాడు. ఆ తరువాత 1989లో ఎ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ‘భలే దొంగ’ అనే సినిమాలో కూడా శ్రీదేవిని అనుకున్నారు. కానీ ఆ సమయంలో శ్రీదేవి హిందీ సినిమాలతో బిజీగా ఉంది. దీంతో ఈ సినిమాల్లో నటించడానికి శ్రీదేవి ముందుకు రాలేదు. కానీ బాలకృష్ణ, శ్రీదేవిలు కలిసి రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగదేవత అనే సినిమాల్లో కనిపిస్తారు. కానీ జంటగా మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.

    బాలనటిగా ఆరంగేట్రం చేసిన శ్రీదేవి తెలుగు హీరోలందరితో కలిసి నటించింది. ఆమె మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు, వెంకటేశ్ తో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఆమె నటించినవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ గా మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ కనిపించబోతుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తల్లి లాగే జాన్వి కపూర్ తెలుగు పరిశ్రమపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.