spot_img
Homeలైఫ్ స్టైల్Fixed Deposit Tips: తాతల ఫిక్స్ డ్ డిపాజిట్(FD)మనవళ్లకు చెందుతుందా.. ఏం చేయాలి..

Fixed Deposit Tips: తాతల ఫిక్స్ డ్ డిపాజిట్(FD)మనవళ్లకు చెందుతుందా.. ఏం చేయాలి..

Fixed Deposit Tips: భారతదేశంలో ఆస్తుల పంపకాలపై పంపకాలపై ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కొందరు తమకోసం.. తమ వారసుల కోసం డబ్బును కూడా పెడుతూ ఉంటారు. మరికొందరు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేస్తుంటారు. అయితే వీరు జీవించినంత కాలం ఇది వారికే చెందుతుంది. లేదా వారి సూచనతో ఇతరులకు చెందిన అవకాశం ఉంటుంది. కానీ వీరి మరణాంతరం ఈ FD తమ కుమారులు లేదా మనువళ్ళకు చెందుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తాత, నానమ్మల మరణానంతరం వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) డబ్బు మనవళ్లకు వస్తుంది. కానీ అది కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం.. తల్లిదండ్రులు (కుమారులు/కుమార్తెలు) లేని పక్షంలో మనవళ్లు మొదటి తరగతి వారసులుగా పరిగణించబడతారు. భారతదేశంలో హిందువులకు హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ద్వారా ఆస్తి పంపిణీ చేస్తారు. ఈ చట్టం ప్రకారం.. మొదటి తరగతి వారసులు – భార్య/భర్త, కుమారులు, కుమార్తెలు, తాత/నానమ్మల కుమారుడు/కుమార్తె ముందుగా మరణిస్తే వారి వాటా నేరుగా మనవళ్లకు చేరుతుంది.

నామినీ ఉన్నప్పుడు ఏమవుతుంది?
FDలో నామినీ ఉంటే.. బ్యాంకు మొదట ఆ నామినీకి డబ్బు ఇస్తుంది. కానీ నామినీ కేవలం ట్రస్టీ మాత్రమే. చట్టపరమైన వారసులకు (మనవళ్లు సహా) సరిగ్గా పంపిణీ చేయాలి. నామినీ నిరాకరిస్తే. మనవళ్లు కోర్టు ద్వారా హక్కు సాధించుకోవచ్చు. నామినీ లేకపోతే, చట్టపరమైన వారసులు (లీగల్ హెయిర్స్) క్లెయిమ్ చేయాలి. తహసీల్దార్ దగ్గర లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందులో మనవళ్ల పేర్లు ఉంటాయి.

క్లెయిమ్ చేసే పత్రాలు
మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్).
లీగల్ హెయిర్ సర్టిఫికేట్.
అన్ని వారసుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC).
సక్సెషన్ సర్టిఫికేట్ (వివాదం ఉంటే, కోర్టు నుంచి).
ఈ పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేస్తే, FD మొత్తం + వడ్డీ వారసులకు పంపిణీ అవుతుంది.

గొడవలు రాకుండా తాత/నానమ్మలు జీవించి ఉన్నప్పుడే సరైన నామినీలు చేయాలి లేదా వీలునామా (విల్) రాయాలి. బ్యాంకులు RBI నియమాల ప్రకారం పనిచేస్తాయి. కాబట్టి పూర్తి పత్రాలు సిద్ధం చేసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper