spot_img
Homeఎంటర్టైన్మెంట్Darling Re Release Closing Collections: 'డార్లింగ్' రీ రిలీజ్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.....

Darling Re Release Closing Collections: ‘డార్లింగ్’ రీ రిలీజ్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. టార్గెట్ ని అందుకోలేకపోయింది..

Darling Re Release Closing Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్’ చిత్రాన్ని రీసెంట్ గానే గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా, అభిమానులు , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మొదటి రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే ఆడియన్స్ నుండి ఎక్కువ రెస్పాన్స్ రావడం గమనార్హం. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే దాదాపుగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ మార్కుని మాత్రం అందుకోలేకపోయింది. ప్రభాస్ అభిమానులతో పాటు, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన థర్డ్ పార్టీ వాళ్ళు 10 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం ఫుల్ రన్ లో రాబడుతుందని అనుకున్నారు.

నేడు 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు అధికారికంగా ఒక పోస్టర్ ని అయితే విడుదల చేశారు కానీ , అందులో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 4 కోట్ల 24 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 53 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 7 కోట్ల 24 లక్షల రూపాయిలు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 9 కోట్ల 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. టాలీవుడ్ రీ రిలీజ్ చిత్రాల్లో ఇది ఆల్ టైం టాప్ 2 రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఖలేజా చిత్రం ఖాతాలోనే ఫుల్ రన్ రికార్డు ఉంది. ఈ సినిమాకు క్లోజింగ్ లో దాదాపుగా 10 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓపెనింగ్స్ విషయం లో అయితే ‘గబ్బర్ సింగ్’ దే పై చెయ్యి, దరిదాపుల్లో మరో సినిమా లేదు. మరి ఈ రెండు రికార్డ్స్ ని రాబోయే రోజుల్లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper