Homeక్రీడలుEmotional Tweet By Indian Cricketers: నిండా ముంచేసి ఇప్పుడు ట్విట్టర్ లో ముసలికన్నీరు కారుస్తున్న...

Emotional Tweet By Indian Cricketers: నిండా ముంచేసి ఇప్పుడు ట్విట్టర్ లో ముసలికన్నీరు కారుస్తున్న టీమిండియా క్రికెటర్లు

Emotional Tweet By Indian Cricketers: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది మన క్రికెటర్ల కథ. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో వెన్ను చూపించి మరీ వెనుదిరుగుతున్నారు. ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా ఇప్పుడు భారమైన హృదయంతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది. అభిమానుల కోరిక తీర్చకుండానే వెళ్తున్నామని కన్నీరు కార్చడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏ ఒక్కరిని నిందించేది లేదు. ఓటమికి అందరు బాధ్యులే.

Emotional Tweet By Indian Cricketers
Emotional Tweet By Indian Cricketers

చావో రేవో అనే సమయంలో టీమిండియా ప్రదర్శన చెత్తగా ఉంది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయకుండా ఇంగ్లండ్ కు విజయం అప్పగించి ఇప్పుడు భావోద్వేగ హృదయంతో వస్తున్నామని ట్విట్టర్ వేదికగా మొసలి కన్నీరు కార్చడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మన వారి నిర్వాకం వల్ల కప్ రాకున్నా ఫర్వాలేదు కానీ పరువు మాత్రం గంగలో కలిసింది. కనీసం వారిని అడ్డుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ సెషన్ లో ఒక సూర్య కుమార్ యాదవ్ మినహా ఎవరు కూడా రాణించలేదు. దీంతో టీమిండియా అపవాదు మూటగట్టుకుంది.

ఇప్పటికే వస్తున్న విమర్శలకు మొత్తం టీమిండియా ఆటగాళ్లందరని మార్చనున్నట్లు సమాచారం. విజయం సాధించాల్సిన చోట బొక్కబోర్లా పడటం మనవాళ్లకు అలవాటుగా మారింది. విజయం సాధించే చోట వెన్ను చూపి వెనుకకు తిరగడంలో సిద్ధహస్తులయ్యారు. విమర్శలకు కూడా జడవడం లేదు. తీరా అపజయం అపహాస్యం చేయడంతో కప్ సాధించలేని స్థితిలో వెనుదిరుగుతున్నామని ట్విట్టర్ లో ట్వీట్ల చేయడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థిని కాస్తయినా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయకపోవడం విడ్డూరం.

Emotional Tweet By Indian Cricketers
Emotional Tweet By Indian Cricketers

తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు టీమిండియా ఓటమికి అందరు బాధ్యులయ్యారు. విజయం సాధించేందుకు ప్రయత్నించకపోవడంపైనే అందరు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. టీమిండియా ఇంత నీచానికి దిగజారిందని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. ఆటగాళ్ల తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పరుగుల వేటలో ప్రత్యర్థిని కొంచెమైనా నిలువరించలేకపోవడం గమనార్హం. ఇంకా ట్విట్టర్ లో తమకు బాధ కలిగించిందని మొసలి కన్నీరు కార్చడమెందుకు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయి ఎంత కన్నీరు కారిస్తే ఏం లాభం. చెరువులో నీళ్లు పోయి చెరువు వెనకాల పడ్డాక ఇంకేం చేస్తాం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper