Don’t change your focus : తమ జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ పదును పెట్టంది ఏ ఇనుము ఉపయోగకరంగా మారదు. అందువల్ల ఇనుము ఉపయోగకరంగా మారాలంటే సాన పెట్టాలి. అంటే జీవితం కూడా సక్సెస్ఫుల్ గా మారాలంటే ఎంతో కష్టపడాలి. అది ఈరోజే కావచ్చు.. ఈ క్షణమే కావచ్చు.. సమయం కోసం వేచి చూడకుండా ప్రయత్నం ప్రారంభిస్తే విజయం వెంటపడి మరి వస్తుంది. అయితే కొంతమంది తాము జీవితాంతం కష్టపడినా.. సరైన సక్సెస్ లేదని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న తమకు అనుకూలమైన ఫలితాలు లేవని అంటుంటారు. మరి కొందరు జీవితాంతం కష్టపడి చివరి వరకు విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాంటి వారు ఎవరు? ఎప్పుడు జీవితం సక్సెస్ గా మారుతుంది?
ఇటీవల కాలంలో మార్కెట్లో ఎక్కువగా KFC గురించి వినే ఉంటారు. టేస్టీగా ఉండే చికెన్ పీసెస్ విక్రయించే ఈ సంస్థ అమెరికాలో ఏర్పాటయింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. అయితే ఈ సంస్థ అభివృద్ధి వెనక ఎంతో ఆరాటం, కష్టం దాగి ఉంది. కల్నల్ హర్లాండ్ శాండర్స్ అనే వ్యక్తి దీనిని ప్రారంభించాడు. అయితే తాను 1930లో చిన్నా రెస్టారెంట్ ను ప్రారంభించాడు. కానీ 20 ఏళ్ల పాటు శ్రమించగా 1952లో ప్రపంచ దేశాల్లో రెస్టారెంట్లను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత తన 90వ ఏట మరణించాడు.
Also Read: ఇండస్ట్రీ లో స్టార్ హీరో అవ్వాలంటే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండాల్సిందేనా..?
అంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే ఏదైనా ప్రయత్నం ప్రారంభించగానే వెంటనే సక్సెస్ కావాలని అనుకుంటారు. కానీ సక్సెస్ కోసం వెయిట్ చేయడం కూడా ఒక ప్రయత్నమే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సరే ప్రయత్నాలు మాత్రమే చేయాలి.. సక్సెస్ కోసం ఎదురుచూడద్దు. కానీ సరైన విధంగా ముందుకు వెళ్తే సక్సెస్ దానంతట అదే వస్తుంది.
అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కేవలం లక్ష్యం వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. మిగతా విషయాలను పట్టించుకోవద్దు. ఏకలవ్యుడు తన గురిని చెట్టు మీద ఉన్న పిట్టపై మాత్రమే పెడతాడు. చుట్టూ ఉన్న కొమ్మలను పట్టించుకోవడం ద్వారా ముందుకు వెళ్లలేడు. అలాగే జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వారే సక్సెస్ఫుల్గా రాణిస్తారు. అయితే ఈ ప్రయాణంలో కొందరు సహకరిస్తారు.. మరికొందరు సహకరించారు. అలాంటి వారిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి.
ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లి ఒక సమయాన్ని నిర్ణయించుకోవడం వల్ల.. చేసే ప్రయత్నం సమర్థవంతంగా ఉంటుంది. నిర్ణీత సమయంలో దానిని పూర్తి చేసిన తర్వాత ఫలితం కోసం చూస్తే పర్వాలేదు.. కానీ ప్రయత్నం ప్రారంభించిన వెంటనే ఫలితం రావాలని ఆశిస్తే మాత్రం ఎవరు సక్సెస్ కాలేరు. అందువల్ల సక్సెస్ఫుల్ జీవితం కావాలని అనుకునేవారు పట్టుదలతో ముందుకు వెళ్తూ అనుకున్న పనిని పూర్తి చేయాలి.