Bollywood mythological film: దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం గురించి టాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా మారింది రామాయణం. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్ నటులు ఈ రామాయణంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఒకరు ఇందిరా కృష్ణ. ఈమె మాతా కౌశల్య పాత్రను పోషిస్తుంది.
Also Read: బిగ్ బాస్ షోలోకి రోబో ఎంట్రీ..’స్క్విడ్ గేమ్స్’ రేంజ్ లో ప్లాన్ చేశారుగా!
ఇందిరా కృష్ణ గతంలో రణబీర్ కపూర్ తో కలిసి పనిచేసింది . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా యానిమల్ లో రష్మిక మందన్న తల్లిగా, రణబీర్ అత్తగా నటించింది. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ గా నిలిచి ఇందులోని యాక్టర్లకు కూడా మంచి టాక్ ను సంపాదించి పెట్టింది. అదే సినిమాలో రణబీర్ తో కలిసి పని చేసిన ఇందిరా రణబీర్ తో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.
రణ్‌బీర్ నుంచి నేర్చుకున్న విషయం
యానిమల్ తర్వాత కౌసల్య పాత్రకు నిర్మాతలు, దర్శకులకు తన పేరును సూచించింది కూడా రణబీర్ కపూర్ అంటూ గుర్తు చేసింది ఇందిరా కృష్ణ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందిరా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాదు రణబీర్ కపూర్‌తో యానిమల్‌లో పనిచేశానని ఆ తర్వాత, తనను రామాయణం కోసం సిఫార్సు చేశాడని కూడా తెలిపింది. అతను చాలా డౌన్ టు ఎర్త్ వ్యక్తి, సెట్‌లో ఎప్పుడూ ఎలాంటి స్టార్‌డమ్‌ను చూపించడు. స్పాట్ బాయ్ నుంచి అతని సహనటుడు వరకు, అందరినీ వినయంగా చూస్తాడు అంటూ కొనియాడింది. గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి వంటి విషయాలను రణ్ బీర్ నుంచి నేర్చుకున్నాను అంటూ తెలిపింది కౌసల్య.
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
రణబీర్ కపూర్ అహంకారి కాదు.
చాలా సంవత్సరాలు టీవీలో పని చేశాను అని సెట్స్‌లో చాలా మంది నటులు అహంకారంగా ఉంటారని వారందరినీ సహించాను అంటూ గుర్తు చేసుకుంది. తను సెట్ కి వెళ్లి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్ లు షోకి ఆలస్యంగా కూడా వచ్చేవారట. కానీ రణ్‌బీర్ కపూర్ మాత్రం అసలు అలా కాదు. పనిని చాలా గౌరవిస్తాడు. మీరు మీ పనిని గౌరవిస్తే, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారనే విషయం కూడా తన నుంచే నేర్చుకున్నాను అంటూ కొనియాడింది కౌసల్య.
ఇక సాయి పల్లవి, రణబీర కపూర్ నటించే ఈ సినిమా కోసం ఎందరో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.