Jabardasth Nookaraju And Asiya:అనతికాలంలో బుల్లితెర స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా ఎదిగాడు నూకరాజు. పటాస్ షో ద్వారా ఇతడు వెలుగులోకి వచ్చాడు. శ్రీముఖి-రవి యాంకర్స్ గా పటాస్ స్టాండప్ కామెడీ షో గతంలో ప్రసారం అయ్యింది. పటాస్ షోలో తనదైన కామెడీ టైమింగ్ తో నూకరాజు(NOOKARAJU) ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. పటాస్ షో నిలిపివేయడంతో జబర్దస్త్ కి వచ్చాడు. సాధారణ కమెడియన్ గా పలు టీమ్స్ లో పని చేశాడు. సీనియర్ కమెడియన్స్ తో పోటీపడుతూ నూకరాజు తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. పలువురు సీనియర్ కమెడియన్స్ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో నూకరాజుకు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ కూడా దక్కింది.
అడపాదడపా చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్న నూకరాజు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో సందడి చేస్తున్నాడు. కాగా బుల్లితెర లేడీ కమెడియన్ ఆసియాతో నూకరాజుకు చాలా కాలంగా పరిచయం ఉంది. పటాస్ షో నుండే వీరి మధ్య అనుబంధం కొనసాగుతుంది. అది ప్రేమగా మారింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో నూకరాజు-ఆసియా అంగీకరించారు. నూకరాజు-ఆసియా బుల్లితెర కపుల్ గా పాప్యులర్ అయ్యారు.
Also Read: బిగ్ బాస్ షోలోకి రోబో ఎంట్రీ..’స్క్విడ్ గేమ్స్’ రేంజ్ లో ప్లాన్ చేశారుగా!
కాగా నూకరాజుకు ఆసియా(ASIYA) హ్యాండ్ ఇచ్చింది. మరో వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో నూకరాజు వేదనకు గురయ్యాడు. అతని గుండె బద్ధలైంది. దాంతో ట్రాజిక్ సాంగ్ అందుకున్నాడు. మేటర్ ఏంటంటే.. నిజంగా ఆసియాకు వివాహం కాలేదు. జబర్దస్త్ ఫేమ్ బాబు డైరెక్షన్ లో ఓ ప్రైవేట్ ఆల్బమ్ రూపొందించారు. ‘సల్లగుండారాదే’ అనే ఈ ఫోక్ సాంగ్ జులై 4న విడుదల చేశారు. మరొకరిని వివాహం చేసుకుని వెళ్ళిపోతున్న ప్రేయసిని తలచుకుని బాధపడే భగ్న ప్రేమికుడు కాన్సెప్ట్ తో ఈ సాంగ్ రూపొందించారు. ఈ సాంగ్ వైరల్ అవుతుంది.
Also Read: అర్జున్ దాస్.. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఈ విలన్ వెంటపడుతున్నారు…
చాలాకాలంగా నూకరాజు-ఆసియా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు. వారిలో కొన్ని భారీ ఆదరణ రాబట్టాయి. లక్షల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. లేటెస్ట్ ఆల్బమ్ కి యూట్యూబ్ లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. కాగా గతంలో నూకరాజు-ఆసియా మధ్య మనస్పర్థలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. బ్రేకప్ చెప్పుకున్నారని పుకార్లు వినిపించాయి. వ్యక్తిగతంగా వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నప్పటికీ, వృతిపరంగా కలిసి పని చేస్తున్నారు.