Family background in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోలు మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరోలుగా మారుతున్నారు. ఇప్పుడొస్తున్న హీరోలు సైతం తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం… అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరు వారసత్వంగా వచ్చిన వారే కావడం విశేషం…ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చిన వారు ఈ మధ్యకాలంలో టైర్ వన్ హీరోగా ఎదిగిన దాఖలైతే లేవు. మరి వాళ్ళని ఇండస్ట్రీలో కావాలనే స్టార్ హీరోలుగా ఎదిగినివ్వడం లేదా? లేదంటే వీళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయడం లేదా అనే విషయాల మీద క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి టైర్ వన్ హీరోగా నట వారసుల కొడుకులు మాత్రమే ఉండడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట రాబోయే సినిమాలతో అయిన యంగ్ హీరోలు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోలుగా మారుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది… నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి వాళ్లను టైర్ వన్ హీరోల కింద లెక్కేయడం లేదు.
కారణం ఏంటి అంటే వాళ్లకు ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో సక్సెస్ లైతే దక్కడం లేదు. ఒక రకంగా కావాలనే స్టార్ హీరోలు వాళ్లను తొక్కేస్తున్నారు అంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలో అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న వాళ్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.
Also Read: ‘తమ్ముడు’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రమోషన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేదు!
అలాగే వాళ్లతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడతారు. ఒకసారి స్టార్ డైరెక్టర్స్ తో సినిమా వచ్చిందంటే ఆ హీరోని టైర్ వన్ హీరో కింద లెక్కేస్తారు. కలెక్షన్స్ తో పని లేకుండా మంచి ఇమేజ్ పొందాలంటే మంచి కాంబోను సెట్ చేసుకోవడం ఒక్కటే దారి అని మరి కొంతమంది చెబుతున్నారు… ఇకమీదటైనా మన యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా అవతరిస్తారా? వాళ్ళని చూసి మరి కొంతమంది ఇండస్ట్రీకి రావాలని ఉత్సాహాన్ని చూపిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: అక్షరాలా 60 కోట్ల రూపాయిలు..మొదలైన ‘హరి హర వీరమల్లు’ రికార్డుల వేట!
ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న నేపథ్యంలో యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియాను షేక్ చేసే సినిమాలు చేసినప్పుడే వాళ్ళు స్టార్ హీరోలుగా అవతరిస్తారు అని విమర్శకులు సైతం కొన్ని కామెంట్లు చేస్తుండటం విశేషం…