Google Search: ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి గూగుల్ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని ఏ విషయమైనా తెలుసుకునేందుకు గూగుల్ ఎంతో సహకరిస్తుంది. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు గూగుల్ ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను తీసుకుంటారు. అలాగే కొందరు గూగుల్ ద్వారా ఇతర వెబ్ సైట్ లోకి వెళ్లి తమ అవసరాలు తీర్చుకుంటారు. అయితే గూగుల్ లో కొన్ని విషయాలు సెర్చ్ చేయకూడదని గతంలో సైబర్ టెక్నికల్ నిపుణులు తెలిపారు. కానీ కొన్ని విషయాలు సెర్చ్ చేయడం వల్ల చాలా థ్రిల్లింగ్ గా ఫీలవుతారని అంటున్నారు. ముఖ్యంగా రెండు వెబ్ సైట్లను ఓపెన్ చేస్తే గూగుల్ పేజీ వింతగా కనిపిస్తుంది. అదెలా అంటే?
గూగుల్ లోకి వెళ్లి Googla Gravity అనే వర్డ్ ను టైప్ చేయండి. ఇలా చేసి ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన వెబ్ సైట్ లిక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడ ఈ పేజీలో ఎక్కడ టచ్ చేసిన అన్ని కిందపడపోతాయి. మళ్లీ వాటిని యథాస్థానానికి తీసుకెళ్లినా అది సాధ్యం కాదు. దీనితో కొత్త అనుభూతి పొందుతారు.
మరో క్రేజీ వెబ్ సైట్ Scale Of Universe అని టైప్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన లింక్స్ వస్తాయి. ఇలా వచ్చిన వాటిలో మొదటి వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రపంచంలో పరమాణువు నుంచి గెలాక్సీ వరకు ఏదీ ఎంత సైజు ఉందో పక్కాగా తెలుపుతుంది. దీని ద్వారా ప్రతీ వస్తువు సైజు తెలుసుకోవచ్చు. ఇందులోని ఈ వివరాలు చూసి ఆశ్చర్యపోతారు. ఇవే కాకుండా చాలా వెబ్ సైట్లు క్రేజీగా అనిపిస్తాయి. అయితే కొన్ని వెబ్ సైట్లు సెర్చ్ చేయడం వల్ల ఫోన్ హ్యాంగింగ్ అవుతుంది. అలాగే మాల్ వేర్ ప్రాబ్లమ్స్ వల్ల వాటిని టచ్ చేయకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.