Wild Sweetsop: ఈ పండు తింటే కావాల్సినంత కాల్షియం.. ధర కూడా తక్కువే..

వర్షాకాలం చివరి దశలో ఉండగా మార్కెట్లోకి వివిధ రకాల పండ్లు వస్తాయి. వీటిలో సీతాఫలం ఒకటి. వినాయక చవితి ప్రారంభం నుంచి దసరా వరకు ఈ పండ్లు మార్కెట్లోకి విరివిగా వస్తాయి.

Written By: Srinivas, Updated On : January 12, 2024 5:52 pm

Wild Sweetsop

Follow us on

Wild Sweetsop: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో వివిధ పనులు వల్ల అందరూ బిజీగా మారుతున్నారు. కొన్ని లక్ష్యాలు, టార్గెట్ లు పూర్తి చేసే క్రమంలో ఆహారంపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో చాలా మందికి తినే తిండిలో కాల్షియం ఎక్కువగా అందడం లేదు. దీంతో చిన్న వయసులోనే కాళ్లనొప్పులూ అంటూ బాధపడుతున్నారు. కాల్షియం లోపాన్ని నివారించడానికి ప్రత్యేక మెడిసిన్స్ తీసుకున్నా.. కావాల్సినంత కాల్షియం అందడం లేదు. అయితే ఒక పండులో మాత్రం ఎంత కావాలంటే అంత కాల్షియం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది ఏ మార్కెట్లోనైనా లభించే పండు. అందువల్ల దీని ధర కూడా ఎక్కువేం కాదు. ఇంతకీ అది ఏ పండో తెలుసా?

వర్షాకాలం చివరి దశలో ఉండగా మార్కెట్లోకి వివిధ రకాల పండ్లు వస్తాయి. వీటిలో సీతాఫలం ఒకటి. వినాయక చవితి ప్రారంభం నుంచి దసరా వరకు ఈ పండ్లు మార్కెట్లోకి విరివిగా వస్తాయి. మిగతా పండ్లలాగా సీతాఫలం ను ఈజీగా తినే అవకాశం ఉండదు. దానిలోని గింజలను తీసేసి గుజ్జును తీసుకోవాలి. ఇలా చేయడం కొందరు కష్టంగా భావిస్తారు. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి తెలిస్తే మాత్రం ఎవరూ విడిచిపెట్టరు. అంతేకాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు.

సీతాఫలంలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఏ,బీ,కె విటమిన్ల తో పాటు ప్రోటీన్లు, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభ్యమవుతాయి. ఇక ఇందులో కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. దీనిని కొన్ని రోజుల పాటు వరుసగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. సాధారణంగా పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందని అంటారు. కానీ రెండు సీతాఫలాలు తిండే రెండు నెలలకు సరిపోయేంత కాల్షియం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

కేవలం కాల్షియం మాత్రమే కాకుండా గుండెకు మేలు చేసే అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇందులో మెగ్నీషియం, సోడియం, పోటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇక ఇందులో పీచుపదార్థం కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అనిమియాతో బాధపడేవారు సీతాఫలం ను తినాలని అంటున్నారు.