Smart Phone Tips: నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కనిపిస్తుంది. వివిధ అవసరాల నిమిత్తం ఫోన్ ను తప్పనిసరిగా వాడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పలు అవసరాల నేపథ్యంలో మొబైల్ ను కొందరు ఇష్టమొచ్చినట్లు వాడుతూ ఉంటారు. ఈ తరుణంలో మొబైల్ స్లో అవుతుంది. మొబైల్ స్లో అయిన తరువాత చికాకు కలుగుతుంది. ఏదైనా అర్జంట్ మెసేస్ పంపించేవారికి ఈ పరిస్థితి ఏర్పడితే తీవ్ర ఆందోళనగా ఉంటుంది. అసలు మొబైల్ స్లో కావడానికి కారణమేంటి? స్లో అయిన మొబైల్ ను ఫాస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయి సమస్యను పరిష్కరించుకోండి…
మొబైల్ తో కాని పని లేదు. మెసేజ్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్ వరకు ఇప్పుడంతా మొబైల్ తోనే చేస్తున్నారు. క్షణం చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మొబైల్ ద్వారా మెసేజ్ పంపించుకోవచ్చు. అయితే ఒక్కోసారి ఏదైనా అర్జంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా ఫోన్ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి సమయంలో ఫోన్ హ్యాంగ్ అయినట్లవుతుంది.
ఫోన్ స్లో కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఎక్కువ యాప్స్ ఉండి.. వాటిని వాడకపోయినా బ్యాక్రౌండ్ లో అవి రన్ అవుతూ ఉంటాయి.దీంతో మొబైల్ హ్యాంగ్ అవుతుంది. ఇలా అయిన ఫోన్ ను ఫాస్ట్ గా మూవ్ అయ్యేలా చేసుకోవచ్చు. ముందుగా ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపిస్తే PlayStore ఓపెన్ చేయాలి. ఇక్కడ రైట్ అప్పర్ లో రౌండ్ గా ఉన్న ప్రొఫైల్ పిక్ఛర్ పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో Settings అనే అప్షన్ ను ఎంచుకోవాలి. ఇందులోకి వెళ్లిన తరువాత General అనే దానిపై ప్రెస్ చేయండి.
ఇప్పుడు Automatically archive apps అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఆఫ్ అయి ఉందంటే యూస్ చేయని యాప్స్ రన్ అవుతూ ఉన్నాయని అర్థం. దీనిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూజ్ చేయని యాప్స్ ఆఫ్ అయిపోతాయి. దీంతో డేటా వేస్ట్ కాకుండా ఉండడమేకాకుండా ఫోన్ ఫాస్ట్ గా మారుతుంది. ఇప్పుడే మీ మొబైల్ లో ఈ ఆప్షన్ ను సెట్ చేసుకని మొబైల్ ను ఫాస్ట్ గా చేసుకోండి.