Site icon OkTelugu

Thalapathy Vijay Son Unfollowed On Instagram: తమిళ హీరో విజయ్ ని ఇన్ స్టాగ్రామ్ లో ‘Unfollow’ కొట్టిన కొడుకు సంజయ్..ఇది మామూలు స్ట్రోక్ కాదు!

Thalapathy Vijay Son Unfollowed On Instagram

Thalapathy Vijay Son Unfollowed On Instagram

Thalapathy Vijay Son Unfollowed On Instagram: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) గురించే చర్చ నడుస్తోంది. ఆయన సతీమణి నాకు విజయ్ నుండి విడాకులు కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కడమే కాకుండా, ఆయనపై పిటీషన్ లో పేర్కొన్న ఆరోపణలు సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఇది వరకు స్టార్ సెలబ్రిటీలు ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా విడాకుల పిటీషన్ లో ఆరోపణలు చేయలేదు. అలాంటిది విజయ్ పై ఈమె చేయడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర కోణం దాగుందా అనే అంశంపైనా కూడా చర్చించుకుంటున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ దంపతులకు జేసన్ సంజయ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆయన సినీ ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తో ‘సిగ్మా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి

కుర్రాడు చూసేందుకు చాకులాగా ఉన్నాడు , హీరో గా రావొచ్చు కదా, అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకు అయ్యుండి డైరెక్టర్ గా రావడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. అదంతా పక్కన పెడితే జేసన్ సంజయ్ తన తల్లి విడాకుల వ్యవహారం పై చింతిస్తూ, తండ్రి విజయ్ మీద కోపం తో ఉన్నాడని, ఇప్పుడు విజయ్ తో ఆయన మాట్లాడడం లేదని , ఇన్ స్టాగ్రామ్ లో కూడా అందుకే ‘Unfollow’ కొట్టాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జేసన్ సంజయ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్లి చూస్తే ఆయన ఎవరినీ ఫాలో అవ్వడం లేదు. దీనిని బట్టీ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం నిజమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై విజయ్ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తూ చేసిన ట్వీట్స్ కొన్ని వైరల్ అయ్యాయి.

వాళ్ళు మాట్లాడుతూ సంజయ్ ఎప్పటి నుండో ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నాడని. ఆయన ఎప్పుడూ కూడా తన తండ్రిని ఫాలో అవ్వలేదని , కేవలం తన తండ్రిని మాత్రమే కాదు , ఇప్పటి వరకు ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కరిని కూడా ఫాలో అవ్వలేదని అంటున్నారు. ప్రస్తుతం సంజయ్ తన తండ్రి వైపు ఉన్నాడా ?, లేకపోతే తల్లి సంగీత వైపు ఉన్నాడా ?, లేదా ఇద్దరి వైపు ఉన్నాడా ? అనేది పక్కన పెడితే, ఈ విడాకుల వ్యవహారం కారణంగానే సంజయ్ విజయ్ ని అన్ ఫాలో కొట్టాడు అనడంలో ఎలాంటి నిజం లేదు. ఆయన నిజంగానే మొదటి నుండి ఎవరినీ ఫాలో అవ్వడం లేదు అనేది వాస్తవం.

Exit mobile version