Site icon OkTelugu

Sudigaali Sudheer Payal Rajput Viral Video: సుడిగాలి సుధీర్ పై కోపంతో ఊగిపోయిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. వీడియో వైరల్!

Sudigaali Sudheer Payal Rajput Viral Video

Sudigaali Sudheer Payal Rajput Viral Video

Sudigaali Sudheer Payal Rajput Viral Video: బుల్లితెర లో జబర్దస్త్ అనే పాపులర్ కామెడీ షో ద్వారా మన జనాలకు దగ్గరైన సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎవ్వరూ ఊహించనంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కు ఉన్న క్రేజ్ కారణంగా పాపులర్ నిర్మాతలు సైతం సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. మూడు సినిమాలు చేస్తే ‘గాలోడు’ అనే చిత్రం విడుదలైంది. ప్రస్తుతం ఆయన హీరో గా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అలా ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరో పక్క టీవీ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు సుడిగాలి సుధీర్. రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన ‘ఆట’ అనే డ్యాన్స్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్, ఇప్పుడు మరో క్రేజీ షోతో మన ముందుకు వచ్చాడు.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

‘ఆహా’ యాప్ లో ‘సర్కార్’ అనే పాపులర్ గేమ్ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మొదటి మూడు సీజన్స్ కి ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించగా, నాల్గవ సీజన్ నుండి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. నిన్నటి నుండి సీజన్ 6 మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి విష్ణు ప్రియా , పృథ్వి , అఖిల్ సార్థక్ , మోనాల్ గజ్జర్ కంటెస్టెంట్స్ గా విచ్చేసారు. ఈ ఎపిసోడ్ ని నిన్న ఆహా యాప్ లో అప్లోడ్ చేశారు. ఇక రెండవ ఎపిసోడ్ కి పాయల్ రాజ్ పుత్, హెబ్బా పటేల్, రాశి సింగ్, శ్రీ గౌరీ ప్రియా విచ్చేసారు. ఈ నెల 6వ తేదీన ఈ ఎపిసోడ్ ఆహా లో అప్లోడ్ కానుంది.

అయితే కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో ఎప్పటి లాగానే సుధీర్ మార్క్ కామెడీ ఉన్నింది. హీరోయిన్స్ తో ఆయన సరదాగా కలిపే పులిహోర కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ రాగానే ఆమెకు ఒక టెడ్డీ బీర్ ని బహుమతిగా ఇస్తాడు సుడిగాలి సుధీర్. కానీ ఆ టెడ్డీ బేర్ బొమ్మకు కళ్ళు ఉండవు. ఇదేంటి దీనికి కళ్ళు లేవు అని పాయల్ రాజ్ పుత్ అడగ్గా , దానికి సుడిగాలి సుధీర్ సమాధానం చెప్తూ ‘మీ అందాన్ని ఆ టెడ్డీ బీర్ ఎక్కడ చూసి మిమ్మల్ని పడేస్తుందేమో అనే భయం తో దానికి కళ్ళు పీకేశా’ అని సమాధానం చెప్తాడు. ఇది చాలా ఫన్నీ గా అనిపించింది. ఇక ప్రోమో చివర్లో సుడిగాలి సుధీర్ అడిగినా ప్రశ్న కు పాయల్ రాజ్ పుత్ సమాధానం చెప్పాలి. సమయం అయిపోతుంది కానీ సమాధానం చెప్పలేకపోతుంది పాయల్ . దీంతో కోపంతో తన చేతుల్లో ఉన్న టెడ్డీ బీర్ బొమ్మని నెలకు విసిరి కొడుతుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.

 

Exit mobile version