spot_img
Homeక్రీడలుTeam India -WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీం ఇండియా.. ఎలా వెళ్లిందో తెలుసా?

Team India -WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీం ఇండియా.. ఎలా వెళ్లిందో తెలుసా?

Team India -WTC Final
Team India -WTC Final

Team India -WTC Final: వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫనల్‌కు వెళ్లగా, తాజాగా టీం ఇండియా ఫైనల్‌ బెర్తు ఖరారైంది. భారత్‌ ఫైనల్‌కు ఆటంకంగా ఉన్న శ్రీలంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీం ఇండియాకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఫైనల్‌ బెర్తుపై ఉత్కంఠ..
టీం ఇండియా ఫైనల్‌ బెర్తుపై ఐదు రోజులుగ ఉత్కంఠ కొనసాగింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయింది. దీంతో ఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో ఫైనల్‌ చేరే రెండో జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో టీమిండియా ముందున్నా .. శ్రీలంక జట్టు పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తి రేపాయి.

ఫైనల్‌ లో ఆసీస్‌..
బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ముందుకెళ్లింది. అయితే అనూహ్యంగా మూడో టెస్టులో ఓడిపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. భారత్‌పై మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. మరో ఫైనల్‌ బెర్తు కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. భారత్‌– ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టు, న్యూజిలాండ్‌– శ్రీలంక మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

భారత్‌ అవకాశాలు..
ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే.. శ్రీలంక,న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ భారత్, ఆసీస్‌ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయితే కివీస్‌–శ్రీలంక సిరీస్‌ ఫలితంపై సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2–0 తేడాతో సిరీస్‌ను క్లీ¯Œ స్వీప్‌ చేస్తే భారత్‌ ఆశలు గల్లంతవుతాయి. కానీ కివీస్‌పై 1–0 తేడాతో శ్రీలంక గెలిచినా భారత్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్‌ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.

Team India -WTC Final
Team India -WTC Final

న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓటమి..
అంతా ఊహించినట్లే న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఓడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైలన్‌కు టీం ఇండియా చేరుకుంది. ఈనెల 9న ప్రారంభమైన మ్యాచ్‌లో శ్రీలంక మొదట తన ఆటతీరుతో భారత్‌ ఆశలకు గండి కొడుతున్నట్లు కనిపించింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 355, సెకండ్‌ ఇన్సింగ్స్‌లో 302 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్సింగ్స్‌లో తడబడింది. దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కానీ చివరకు న్యూజిలాండ్‌ రెండు వికెట్ల తేడాలో లంకను ఓడించింది. దీంతో టీం ఇండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ ఫలితంతో సబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper