Chanakya Nithi Telugu : భార్యలతో ఇలా ఉంటే.. భర్తలు తప్పకుండా డబ్బు కోల్పోతారని చెబుతున్న చాణక్యుడు

కళ్లలో నీళ్లు రాకుండా అంత మంచిగా భార్యను చూసుకోవాలి. కానీ చాలా మంది భార్యను భాధపెట్టేవారే ఉన్నారు. కానీ అర్థం చేసుకుని తనని సంతోషంగా చూసుకునే వాళ్లు లేరు. భార్యను ఇబ్బంది పెట్టి.. తనకి సంతోషం లేకుండా చేస్తే ఆ భర్త తప్పకుండా డబ్బు నష్టపోతాడని చాణ్యక్యుడు చెబుతున్నాడు.

Written By: Kusuma Aggunna, Updated On : August 26, 2024 12:47 pm

Chanakya Nithi Telugu

Follow us on

Chanakya Nithi Telugu : భార్యాభర్తల బంధం చాలా ముఖ్యమైనది. రెండు జీవితాలు, రెండు మనసులు కలిసి జీవితాంతం బ్రతకాలి. ఎంత అన్యోన్యమైన బంధం అయిన భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు. కానీ వీటిన్నింటిని దాటి ఒకరునొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. చాలామంది భర్తలకి వాళ్ల భార్యతో ఎలా ఉండాలో కూడా సరిగ్గా తెలియదు. ప్రేమగా ఉండకుండా ఆమెను తిడుతూ, హింస పెడతాడు. భార్యకు ఆనందాన్ని ఇవ్వకపోతే ఆ భర్త పేదవాడు అవుతాడని చాణక్య నీతి చెబుతోంది. తన వాళ్ల అందరినీ వదిలి వచ్చిన భార్యకు.. భర్తే అన్ని అయ్యి చూసుకోవాలి. తన పెదవులపై చిరునవ్వు ఎప్పుడు ఉండేలా చూడాలి. తన కళ్లలో నీళ్లు రాకుండా అంత మంచిగా భార్యను చూసుకోవాలి. కానీ చాలా మంది భార్యను భాధపెట్టేవారే ఉన్నారు. కానీ అర్థం చేసుకుని తనని సంతోషంగా చూసుకునే వాళ్లు లేరు. భార్యను ఇబ్బంది పెట్టి.. తనకి సంతోషం లేకుండా చేస్తే ఆ భర్త తప్పకుండా డబ్బు నష్టపోతాడని చాణ్యక్యుడు చెబుతున్నాడు.

పర స్త్రీని కోరుకుంటే..
వేరే స్త్రీ మీద వ్యామోహం లేదా భార్యను దూరం పెట్టి వేరే వాళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. దీంతో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. ఇలా భర్త తన ఆస్తి, డబ్బును కూడా కోల్పోవచ్చు. పురుషుడు తన భార్యను తప్ప ఇంకా ఎవర్ని కూడా కోరుకూడదు. జీవితాంతం తన భార్యతో మాత్రమే సంతోషంగా ఉండాలి. తనని బాధపెట్టకుండా, కన్నీరు రాకుండా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటుంది.

బద్దకంగా ఉండకూడదు
పురుషుడికి అస్సలు బద్దకం ఉండకూడదు. సోమరితనం ఉంటే లక్ష్మీ దేవి అతని ఇంట్లో ఉండదు. బద్దకంతో ఇంట్లోనే ఉంటారు. అసలు ఏ పని చేయరు. దీనివల్ల వాళ్లు అప్పులు చేసి మరి ఇంకా సమస్యలను పెంచుకుంటారు. దీనివల్ల వాళ్ల భార్యలు ఇబ్బంది పడతారు.

దురాశ దుఃఖానికి చేటు
దురాశ అనే ఎవరికి ఉండటం అంత మంచిది రాదు. అందరూ బాగుండాలనే కోరుకోవాలి. కానీ వేరే వాళ్లపై దురాశగా ఉంటే లక్ష్మీ దేవి ఇంట్లో నిలవడం కష్టం. దీంతో ఆ పురుషుడు చాలా డబ్బును కోల్పోతాడని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి అందరితో మంచిగా ఉండాలి. లేకపోతే ఈర్ష్యతో ఉంటే ఆ పురుషులు తప్పకుండా పెదవారు అవుతారట.

తప్పుడు మాటలు అనకూడదు
భార్యను గౌరవంగా చూసుకోవాలి. తల్లిని, చెల్లిని ఎలా గౌరవిస్తారో.. భార్యను కూడా అలానే గౌరవించాలి. ఆమెను కించపరిచిన, తప్పుడు మాటలు అన్నా, చెడు పదాలతో తిట్టిన ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికీ ఉండదు. వీళ్లు జీవితంలో ఏ విషయంలోనూ విజయం సాధించలేరు. భార్యను గౌరవించాలి. ప్రేమించాలి. తన కళ్లంట నీరు రాకుండా చూసుకోవాలి. తన కష్ట సమయంలో తనని కంటికి రెప్పలా కాపాడుకుని జీవితాంతం భర్త తోడు ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలా చేయకపోతే ఆ పురుషుడు తప్పకుండా పేదరికం అనుభవిస్తాడని చెబుతున్నారు.