https://oktelugu.com/

Google Search : గూగుల్‌లో ఇవి సెర్చ్ చేస్తున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు!

కొన్ని విషయాలు మాత్రమే గూగుల్‌లో సెర్చ్ చేయాలి. అలా కాకుండా ఈ విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే అంతే సంగతులు ఇక. కొన్ని అంశాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే నేరంగా పరిగణిస్తారు. వీటిని సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది. మరి గూగుల్‌లో సెర్చ్ చేయకూడని ఆ అంశాలేంటో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2024 / 11:26 PM IST

    Google Search

    Follow us on

    Google Search :  అందరి జీవితాల్లో గూగుల్ ఓ కుటుంబ సభ్యుల్లా మారిపోయింది. ప్రతి విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. చదువు, వంట, సినిమా ఇలా దేని గురించి అయిన గూగుల్ మనకి చిటికెలో సమాచారం ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక దాని గురించి తప్పకుండా గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. అయితే ఈజీగా అన్నింటి గురించి ఇన్ఫర్‌మేషన్ దొరుకుతుందని అన్ని విషయాలను సెర్చ్ చేయకూడదు. కొన్ని విషయాలు మాత్రమే సెర్చ్ చేయాలి. అలా కాకుండా ఈ విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే అంతే సంగతులు ఇక. కొన్ని అంశాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే నేరంగా పరిగణిస్తారు. వీటిని సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది. మరి గూగుల్‌లో సెర్చ్ చేయకూడని ఆ అంశాలేంటో తెలుసుకుందాం.

    పిల్లల అశ్లీల కంటెంట్‌ను సెర్చ్ చేయవద్దు
    చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ గూగుల్‌లో ఏదో ఒక అంశం గురించి సెర్చ్ చేస్తుంటారు. ఏ విషయం గురించి తెలియకపోయిన అందరికీ మొదటిగా గుర్తువచ్చేది గూగులే. అయితే గూగుల్‌కి కూడా కొన్ని భద్రతాపరమైన విషయాలు ఉన్నాయి. ప్రైవసీ, ఐటీ నిబంధనల ప్రకారం ఈ విషయాలను అయితే అసలు సెర్చ్ చేయకూడదు. అందులో మొదటి.. పిల్లల గురించి అశ్లీల వీడియోలను, కంటెంట్‌ను సెర్చ్ చేయకూడదు. ఇలాంటి కంటెంట్ సెర్చ్ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం. ఇలా పిల్లల వీడియోలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఐదు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.

    బాంబు తయారీ
    కొంతమంది కొన్ని వింత డౌట్‌లు వస్తాయి. అసలు బాంబులు ఎలా తయారు చేస్తారని ఆలోచించుకుని.. అలా గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. అయితే బాంబు తయారీ గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా గూగుల్‌లో సెర్చ చేయకూడదు. ఇలా సెర్చ్ చేయడం వల్ల గూగుల్ వెంటనే గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దీని గురించి ఎప్పుడూ కూడా సెర్చ్ చేయకండి. అలాగే డ్రగ్స్ తయారీ విధానం గురించి కూడా గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.

    హ్యాకింగ్ మెథడ్స్
    గూగుల్‌లో హ్యాకింగ్ మెథడ్స్ గురించి అసలు సెర్చ్ చేయకూడదు. దీనిని గురించి మీరు సెర్చ్ చేస్తే వెంటనే మీరు జైలుకు వెళ్తారు. అలాగే ఇతరుల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను కూడా గూగుల్‌లో అప్‌లోడ్ చేసిన కఠిన శిక్షలు తప్పవు.

    గర్భస్రావం
    ఈజీగా గూగుల్‌లో అన్ని విషయాలు తెలుసుకోవచ్చని కొందరు గర్భస్రావం గురించి సెర్చ్ చేస్తుంటారు. అబార్షన్ ఎలా చేసుకోవాలని గూగుల్‌‌లో సెర్చ్ మీరు తప్పకుండా జైలుకు వెళ్తారు. డాక్టర్ పర్మిషన్ లేకుండా అబార్షన్ చేసుకోవడం నేరం. మీరు ఒకవేళ చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది.