https://oktelugu.com/

Amy Jackson : పెళ్లి ఒకరితో..గర్భం మరొకరితో..పరువు తీసేసిన రామ్ చరణ్ హీరోయిన్!

ఇది ఇలా ఉండగా అమీ జాక్సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అంతకు ముందు ఈమె తమిళం లో మద్రాసు పట్నం అనే సినిమా చేసింది. ఎవడు చిత్రం తర్వాత అమీ జాక్సన్ శంకర్ తెరకెక్కించిన 'ఐ', 'రోబో 2.0' వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 26, 2024 / 10:15 PM IST

    amy jackson

    Follow us on

    Amy Jackson :  సినీ సెలెబ్రిటీలను కోట్లాది మంది అభిమానులు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఈమధ్య సినీ సెలెబ్రిటీలు పెళ్లి అనే మహోన్నత సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తూ సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. పెళ్ళికి ముందే డేటింగ్ అనేది బాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితమే ఒక సంప్రదాయం గా మారిపోయింది. ఆ సంస్కృతి మన టాలీవుడ్ కి ఈమధ్యనే అలవాటు అయ్యింది. మరోపక్క ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్న జంట, కనీసం రెండేళ్లు కూడా గడవకముందే చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలను ఎన్నో మనం చూసాము. ఇదంతా పక్కన పెడితే అమీ జాక్సన్ అనే తమిళ హీరోయిన్ రీసెంట్ గానే ఎడ్ వెస్ట్ విక్ అనే అతనితో నిశ్చితార్థం జరుపుకుంది.

    దానికి సంబంధించిన ఫోటోలను కాసేపటి క్రితమే ఆమె ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో నెటిజెన్స్ పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అమీ జాక్సన్ జార్జ్ అనే అతనితో డేటింగ్ చేసింది. అతనితో కలిసి ఉంటున్నట్టుగా తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలు కూడా అప్పట్లో అప్లోడ్ చేసేది. అలా వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్న సమయంలోనే అమీ జాక్సన్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అలా మూడేళ్లు సజావుగా సాగిన వీళ్లిద్దరి జీవితం, అనుకోకుండా కొన్ని అభిప్రాయం భేదాలు రావడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు సోలోగానే జీవితాన్ని గడిపిన అమీ జాక్సన్, ఎడ్ వెస్ట్ విక్ తో డేటింగ్ చేసి మొత్తానికి నేడు అతనితో నిశ్చితార్థం జరుపుకుంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ పెళ్లి ఒకరితో, గర్భం మరొకరితో , ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు, ఇలాంటి పనులు చేసి నీ అభిమానులకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు అంటూ నిలదీస్తున్నారు.

    ఇది ఇలా ఉండగా అమీ జాక్సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అంతకు ముందు ఈమె తమిళం లో మద్రాసు పట్నం అనే సినిమా చేసింది. ఎవడు చిత్రం తర్వాత అమీ జాక్సన్ శంకర్ తెరకెక్కించిన ‘ఐ’, ‘రోబో 2.0’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఈ సినిమాల తర్వాత అమీ జాక్సన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకునే సమయంలో జార్జ్ తో ప్రేమలో పడడం, సినిమాలకు దూరం కావడం జరిగింది. 2018 తర్వాత సినిమాలకు దూరమైన అమీ జాక్సన్, ఇప్పుడు మిషన్ : చాప్టర్ 1 అనే తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు, ఇప్పుడు ఆమె సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది.