Chanakya Nithi: మనలో చాలామంది స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. మన జీవితంలో మంచి స్నేహితులు ఉంటే ఎలాంటి సందర్భంలోనైనా మంచి స్నేహితులు మనకు సహాయసహకారాలు అందిస్తారు. అలా కాకుండా చెడ్డ స్నేహితులు ఉంటే మాత్రం ఎలాంటి సందర్భంలోనైనా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్నేహం చేసే వ్యక్తులను ఎంచుకునే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆచార్య చాణక్యుడు చెడ్డ స్నేహితులను ఎప్పటికీ నమ్మవద్దని సూచించాడు. చెడ్డ స్నేహితులకు మనపై కోపం వస్తే వాళ్లు మనకు సంబంధించిన రహస్యాలను ఇతరులకు వెల్లడించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇతరులతో స్నేహం చేసే సమయంలో జాగ్రత్తగా మెలగాలి. మంచి స్నేహితులు ఉంటే ఎంత మేలు జరుగుతుందో చెడు స్నేహితులు ఉంటే అదేస్థాయిలో కీడు జరుగుతుంది. స్వార్థపూరిత స్నేహితులకు మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు.

అదే సమయంలో ముఖం మీద తియ్యగా మాట్లాడే వ్యక్తుల మాటలను అస్సలు నమ్మవద్దని చాణక్యుడు సూచించారు. అలాంటి వాళ్లు పైకి మంచిగా కనిపించినా మనకు తెలియకుండానే మనకు హాని చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అత్యాశతో ఉన్న స్నేహితులు తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడానికి కూడా సిద్ధపడతారు. స్వార్థపరుల వల్ల మనకు నష్టమే తప్ప ఎలాంటి లాభం కలగదని గుర్తు పెట్టుకోవాలి.
ఒక వ్యక్తి చుట్టూ అలాంటి వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే మాత్రం అతనికి హాని కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి స్నేహితుల విషయంలో జాగ్రత్త వహిస్తే జీవితాంతం సంతోషంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.