Allu Arjun: వైవిధ్యమైన సినిమాలతో అలరించే అతి కొద్దిమంది నటులలో అల్లు అర్జున్ ఒకరు. చేసిన కొన్ని సినిమాలతోనే తనలోని అన్ని కోణాలను ప్రదర్శించేశాడు. డ్యాన్స్, నటన, ఫైట్స్ లలో తనదైన మేనరిజాన్ని చూపిస్తూ టాలీవుడ్ లో బాక్సాఫీస్ కింగ్ గా ఎదిగాడు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఈ స్టైలిష్ స్టార్.
యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి. అతని డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మొదలు పెడితే.. హెయిర్ స్టైల్ వరకు యూత్ అతన్ని బాగా ఫాలో అవుతారు. ఇతను హీరోనేనా అనే స్థాయి నుంచి.. యూత్ ఐకాన్ స్టార్ గా ఎదిగి.. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే స్థాయి వరకు ఎదిగి చూపించాడు.
Also Read: Sri Leela: గుడ్డిగా ‘రష్మిక’నే ఫాలో అవుతుంది.. మరి ఎదుగుతుందా ?
లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే అప్పటికే ఆయన తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే అల్లు అర్జున్ మొదట చిరంజీవి నటించిన విజేత మూవీతోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత అతను హీరోగా మొదటి సారి మెగాస్టార్ లెగసీతో గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి మూవీతోనే హిట్ అందుకున్నాడు బన్నీ. అయితే ఈ మూవీలో అతనిపై చాలా రూమర్లు వచ్చాయి. అసలు ఇతను హీరోనేనా అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరిపై రానన్ని విమర్శలు బన్నీ మీదనే వచ్చాయి. కానీ వాటిని అవమానంగా తీసుకోకుండా ఛాలెంజ్ గా తీసుకున్నాడు బన్నీ.
ప్రతి సినిమాలో తనను తాను మలుచుకున్నాడు. కొత్త వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు. అదే సమయంలో యూత్‌ను ఆకట్టుకునేందుకు స్టైలిష్ లుక్‌లను ట్రై చేశాడు. అతను చేసిన రెండో సినిమా ఆర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరి నోళ్లు మూయించాడు. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది. దాంతో ఎవరీ కుర్రాడు అని అందరూ బన్నీ గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
ఇక రేసుగుర్రం మూవీతో తొలిసారి రూ.50కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత సరైనోడు మూవీతో తొలిసారి రూ.100కోట్ల మార్కును అందుకున్నాడు. ఇక అల వైకుంఠపురం మూవీతో ఏకంగా రూ.200కోట్ల కలెక్షన్లతో ఊచకోత కోశాడు. ఇప్పుడు ఏకంగా స్టైలిష్ స్టార్ నుంచి పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి రూ.350కోట్ల క్లబ్ లో చేరి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ఇలా ప్రతి సినిమాతో న రేంజ్‌ను, మార్కెట్ ను పెంచుకుంటూ బాక్సాఫీస్ కింగ్ గా అవతరించాడు. అయితే టాలీవుడ్ లో మిగతా హీరోలందరికంటే ముందే బన్నీకి కేరళలో మార్కెట్ ఉంది. ఇప్పుడు మిగతా అన్ని భాషల్లో కూడా మార్కెట్ ఏర్పడింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే పుష్ప-2 రాబోతోంది. దీని తర్వాత MCA ఫేమ్ డైరెక్టర్ తో ఐకాన్ అనే మూవీని చేస్తున్నాడు. ఇప్పుడు బన్నీ చేస్తున్నవన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలే.
Also Read:Father kills son: వైరల్ వీడియో: కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి