CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. పాత వారిచేత రాజీనామా చేయించి కొత్త వారికి అవకాశమిచ్చేందుకు సిద్ధమయ్యారు.దీంతో మంత్రివర్గ విస్తరణపై అందరిలో ఆశలు పెరుగుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రులందరు తమ పదవులకు స్వచ్చంధంగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసమే పనిచేస్తామని అధినేతకు భరోసా కల్పించారు
మంత్రులు మాత్రం తాము రాజీనామాలు చేసేందుకు బాధపడటం లేదని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు. రాజీనామా చేసిన మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారు. వారికి కేబినెట్ హోదా కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు కూడా అలకబూనాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. వారి స్థాయికి తగిన పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నామని చెబుతున్నారు.
Also Read: Jagan Cabinet: కొత్త కేబినేట్ ఇలా ఉండబోతుందా..?
మంత్రి పదవులు కోల్పోతున్న వారికి జగన్ సముచిత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా, ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వారికి కేబినెట్ హోదా ఇప్పించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజీనామా చేసిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించి వారితో పని చేయించుకునేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాజీనామాలు చేసిన మంత్రులు ఎప్పటిలాగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వెసులుబాటు కల్పించనున్నారు. దీని కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మంత్రుల సేవలు వినియోగించుకునేందుకే నిర్ణయించుకున్నారు. అందుకే వారికి స్థాయి తగ్గకుండా ఉండేందుకు వేదికలపై కూర్చునే వీలు కల్పించేందుకు పదవులు సృష్టిస్తున్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వంలో ఎవరు నిరాశ చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అందరికి ప్రాధాన్యం కల్పించే సందర్భంలో వారితో పనిచేయించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పదవులు కోల్పోయినా వారి స్థాయి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే వారిని మండలి చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు.
Also Read:AP Cabinet Expansion: ఏపీ మంత్రివర్గంలో ఆ ఐదారుగురు ఎవరు?