https://oktelugu.com/

bath : స్నానం చేయాలంటే బోర్ గా ఉందా? మీ పని మిషన్ కు వదిలేయండి క్లీన్ అయిపోతారు..

టెక్నాలజీ పెరిగిపోతుంటే బద్దకం డోర్లు ఓపెన్ చేసుకొని తిష్ట వేస్తుంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 6, 2024 / 11:46 AM IST

    bath

    Follow us on

    bath : టెక్నాలజీ పెరిగిపోతుంటే బద్దకం డోర్లు ఓపెన్ చేసుకొని తిష్ట వేస్తుంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఫుల్ గా పొట్టలు పెంచుతున్నారు. ఆ పొట్టను కరిగించేందుకు జిమ్ లకు కామన్ గా వెళ్తున్నారు ఇక ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులే ఫుల్ గా కనిపిస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గరి నుంచి, జుట్టు దువ్వుకోవడం వరకు అన్నీ మెషీన్లు పని చేస్తున్నాయి. టెక్నాలజీ రోజురోజుకూ అప్‌గ్రేడ్ అవుతుంది. వాటిని ఉపయోగిస్తున్న జనాలు మాత్రం సోమరిపోతులుగా మారుతున్నారు.

    పళ్లు తోముకోవడానికి కూడా ఎలక్ట్రిక్ బ్రష్‌ల వచ్చాయి. మలవిసర్జన చేసిన తర్వాత చేతిని ఉపయోగించకుండా సెన్సార్లతో కొత్త రకం టాయిలెట్లు వచ్చాయి. మన మెదడు కూడా ఆలోచించకుండా.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ వచ్చే కొందరి ఉద్యోగాలను కొల్లగొట్టింది. మన కంట్రోల్ లేకుండానే మన పని జరిగిపోతోంది. ఇక అన్ని ఉన్నాయి కానీ స్నానం చేయడానికి ఓ మిషన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా. ఎక్కువగా ఆలోచించవద్దు. అది కూడా వచ్చేసిందండీ బాబూ. అంటే హ్యూమన్ వాషింగ్ మెషీన్ కూడా వచ్చేసింది అన్నమాట. మనం స్నానం చేయాల్సిన అవసరం లేదు. అందులో వెళ్లి కూర్చొంటే చాలు అదే మనల్ని బట్టలు ఉతికినట్లు ఉతికేస్తుంది.

    టెక్నాలజీ అనగానే ముందుగా జపాన్ పేరు గుర్తు వస్తుంది. ఈ క్రమంలోనే రోజూ పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే బద్దకంగా అనిపించే వారికి జపాన్‌లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను వినియోగించి ఎలాంటి కష్టం లేకుండా 15 నిమిషాల్లో స్నానం చేయవచ్చు. హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను జపాన్‌లోని సైన్స్ కో అనే కంపెనీ తయారు చేసింది. ఓ ఎక్స్‌పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను ఉంచిన సైన్స్ కో కంపెనీ ఆ మిషిన్ లను ప్రజలు వినియోగించేలా అవకాశం కల్పించింది.

    ఒసాకాలోని కన్సాయి ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ మెషీన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. దీన్ని చూడటానికి వచ్చిన వెయ్యి మంది ఈ మెషీన్‌ను ఉపయోగించి.. స్నానం చేసేలా సైన్స్ కో కంపెనీ ఏర్పాట్లు చేసింది. ఇలా ఈ మిషిన్ తో స్నానం చేసిన తర్వాత ప్రజలు చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్లు తయారు చేస్తామని ప్రకటించింది కంపెనీ.

    ఈ మిషిన్ చూడటానికి ఫైటర్‌జెట్‌ కాక్‌పిట్‌ ఆకారాన్ని కలిగి ఉంటుంది. బయటి నుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఇక అందులోకి ఒక వ్యక్తి వెళ్లాక మిషన్ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత సగానికిపైగా వేడినీరును నింపుకుంటుంది మిషన్. ఇందులోని హైస్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్ల లాగా చిమ్ము తుంటుంది. ఇక ఆ నీటిలో 3 మైక్రోమీటర్ల సైజులో చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడుతాయి. ఈ నీటి బుడగలు.. మనిషి శరీరంపై ఉండే మురికిని తొలగిస్తాయి.