Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: ఆ మాజీ డిప్యూటీ సీఎంకు జగన్ షాక్!

YS Jagan: ఆ మాజీ డిప్యూటీ సీఎంకు జగన్ షాక్!

YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటోంది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో అక్కడ సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా నాయకత్వ మార్పు పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ముందుగా తన సొంత జిల్లాపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కడప జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి చెక్ చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా అంజాద్ బాషా ఉన్నారు. ఆయన మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. రెండుసార్లు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆపై డిప్యూటీ సీఎం గా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి హవాకు బ్రేక్ వేయాలంటే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

* తప్పుతున్న పట్టు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కడప జిల్లా( Kadapa district) ఆ పార్టీకి ఆయువు పట్టు. 2014 ఎన్నికల్లో ఒక సాధారణ కార్పొరేటర్ గా ఉన్న అంజాద్ భాషాకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం రెండోసారి ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రెండోసారి కూడా అంజాద్ బాషా గెలిచారు. ఏకంగా జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడమే కాదు డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అంజాద్ బాషా ఓడిపోయారు. ఆయన కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా.. రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి కలిసి వచ్చింది. అయితే ఏకంగా జిల్లా కేంద్రంలోని టిడిపి పాగా వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇలానే కొనసాగితే కడప జిల్లాలో వైసిపి పట్టు కోల్పోవడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

* యువ డాక్టర్ కు పగ్గాలు
కడప జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా( Amjad Basha ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సోదరుడితో పాటు కుటుంబ సభ్యుల వైఖరితో పార్టీకి నష్టం జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. మరోసారి ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ క్రమంలో యువ డాక్టర్ సోహైల్ అహ్మద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మాజీ మంత్రి, దివంగత నేత ఖలీల్ బాషా కుమారుడు. ఆయనకు ఇస్తే ఈజీగా విజయం సాధించవచ్చు అని జగన్మోహన్ రెడ్డికి సర్వే నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆది నుంచి వైసీపీ ఇక్కడ మైనారిటీలకు టికెట్లు ఇస్తూ వస్తోంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అంజాద్ బాషాను మార్చాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోహైల్ అహమ్మద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో ఈ యువ డాక్టర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఏకంగా ఓ మాజీ డిప్యూటీ సీఎం ను తప్పించి.. యువ డాక్టర్ కు అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version