Homeక్రీడలుక్రికెట్‌Shoaib Malik Fourth Marriage: క్రికెట్ కు దూరమైనా "ఆట" ను వదిలిపెట్టలేదు.. ఏకంగా నాలుగో...

Shoaib Malik Fourth Marriage: క్రికెట్ కు దూరమైనా “ఆట” ను వదిలిపెట్టలేదు.. ఏకంగా నాలుగో పెళ్లికి సిద్ధం..

Shoaib Malik Fourth Marriage: అతడు మైదానంలో ఆటగాడు. మైదానం వెలుపల కూడా ఆటగాడే. అందువల్లే కదా మన సానియా మీర్జా ను లైన్లో పెట్టాడు. అప్పటికి పెళ్లయినప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చి సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. చాలా రోజులపాటు కలిసి ఉన్నాడు. సానియా మీర్జా ఒక బాబుకు జన్మను ఇచ్చిన తర్వాత.. మనవాడు మరో దారి చూసుకున్నాడు.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

పాకిస్తాన్ సినీనటిని లైన్ లో పెట్టాడు. అంతేకాదు సానియా మీర్జాకు విడాకులు కూడా ఇచ్చాడు. ఇంత చదివిన తర్వాత ఈపాటికి అతడు ఎవరు మీకు అర్థమయ్యే ఉంటుంది. సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్.. మూడో పెళ్లిని కూడా పెటాకులు చేసుకున్నాడు. సానియా మీర్జా కంటే ముందు షోయబ్ మాలిక్ కు వివాహం జరిగింది. సానియా మీర్జాను లైన్లో పెట్టిన తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఒక కొడుకుని కన్న తర్వాత.. పాకిస్తాన్ సినీ నటిని ముగ్గులోకి దింపాడు. ఈలోగా సానియా మీర్జాకు విడాకులు ఇచ్చాడు.

పాకిస్తాన్ నటితో దాదాపు ఏడాది పాటు సంసారం సాగించాడు. ఆమెపై మోజు తీరిన తర్వాత.. విడాకులు ఇచ్చేశాడు. ఇప్పుడు అలీబా అనే పాకిస్తాన్ యువతి తో షోయబ్ మాలిక్ నిఖాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగుతుందని సమాచారం. పాకిస్తాన్లో పెళ్లి జరగడం ఎంత ఈజీనో.. విడాకులు ఇవ్వడం కూడా అంతే ఈజీ. అందువల్లే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. అన్నట్టు పాకిస్తాన్ క్రికెటర్లు వైవాహిక జీవితంలో నిత్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ 50 సంవత్సరాలకు దగ్గరగా ఉన్న వయసులో తండ్రి అయ్యాడు. అతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ.. లెక్క చేయలేదు. పైగా మరింత మంది పిల్లల్ని కంటానంటూ కామెంట్స్ కూడా చేశాడు. షాహిద్ ఆఫ్రిది.. మహమ్మద్ సమీ.. అమీర్.. ఇలా చెప్పుకుంటూ పోతే వైవాహిక జీవితంలో ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లకు లెక్కేలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper
Exit mobile version