Homeబిజినెస్Yamaha XSR 155 Gold: 'బంగారపు బండి'.. ధర ఎంతో తెలుసా?

Yamaha XSR 155 Gold: ‘బంగారపు బండి’.. ధర ఎంతో తెలుసా?

Yamaha XSR 155 Gold: బైక్ పై డ్రైవ్ చేస్తే స్టైలిష్ గా కనిపించాలని యూత్ అనుకుంటూ ఉంటారు. ఇలాంటివారు స్టైలిష్ గా ఉండే బైక్ కోసం ఎదురు చూస్తుంటారు. వీరికి అనుగుణంగా Yamaha కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. నాటి RX100 నుంచి నేటి XSR బైక్స్ వరకు అన్ని విభిన్న రీతిలో ఉండి యూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల XSR 155 అనే బైక్ కు కొత్త కలర్ ను జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది బ్లాక్ తో పాటు గోల్డ్ కలర్ కలిపి మొత్తంగా బంగారపు బండి లాగా కనిపిస్తుంది. అయితే డిజైన్ మాత్రమే కాకుండా ఈ బండికి ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా డ్రైవర్లకు సపోర్టుగా ఉంటుంది. ఈ బండి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

Yamaha XSR 155 మార్కెట్లోకి కొత్త వెహికల్ వచ్చింది. ఇది మెటాలిక్ బ్లాక్ కలర్ ఉండడంతో దీని ధర కూడా ప్రత్యేకంగా నిర్ణయించారు. ఈ వెహికల్ మూడు నెలలకిందే మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే కలర్ మార్చుతూ కొత్త వాహనాలను తీసుకువచ్చింది. ఈ వెహికల్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉండి USD ఫ్రంట్ పోర్క్ లు మాత్రం గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది. అలాగే మస్క్యులర్ ట్యాంక్ డిజైన్, మినిమలిస్టు బాడీ వర్క్, రెట్రో టైప్ స్టైలింగ్ లో ఉండే ఈ బైక్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. అయితే లేటెస్ట్గా వచ్చిన బైక్ ధర కూడా మారిపోయింది. ఇప్పటివరకు ఈ బైక్ రూ.1.58 లక్షల ప్రారంభ ధరతో విక్రయించేవారు. కానీ ఇప్పుడు రూ.1.59 లక్షల ధర నిర్ణయించారు. అయితే రెడ్ కలర్ బైక్ ధర కాస్త తక్కువతో రూ.1.53 లక్షలతో పొందవచ్చు. సిల్వర్ ఆప్షన్ రూ. 1.57 లక్షలతో విక్రయిస్తున్నారు.

కలర్ ఏదైనా Yamaha xsr 155 బైక్ లో ఉండే ఇంజన్ అద్భుతమైన పనితీరు ఉంటుంది. ఇందులో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో పాటు ఫోర్ వాల్వు ఇంజన్ కూడా ఉండనుంది. ఈ ఇంజన్ 13.5 kW, 14.2 kW టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేసే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కూడా ఉన్నాయి. USD పోర్క్, లింకుడు టైప్ మోనోక్రాస్, డ్యూయల్ ఛానల్ ABS వంటివి ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వెళ్లే ఈ బైక్ స్పోర్ట్స్ లుక్ తో కనిపిస్తుంది. 137 కిలోల తేలికపాటి బరువు తో ఉండే ఇందులో వేగం, ఇందన స్థాయి, గేర్ స్థానం, ట్రిప్ మీటర్ల వివరాలు బైకుకు ఉండే డిస్ప్లేలో కనిపిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version