Homeఅంతర్జాతీయంPakistan Afghanistan Conflict: గిచ్చి కయ్యం పెట్టుకుని.. తన్నించుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan Afghanistan Conflict: గిచ్చి కయ్యం పెట్టుకుని.. తన్నించుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan Afghanistan Conflict: పాకిస్తాన్‌కు రెండు వైపులా దబ్బలు తగులుతున్నాయి. ఆఫ్గానిస్తాన్‌పై సింగిల్‌ బ్యారెల్‌ గన్‌తో దాడిచేసి ఇప్పుడు డబుల్‌ బ్యారెల్‌ గన్‌తో దెబ్బలు తింటోంది. గాజా ఇంటర్నేషనల్‌ స్టెబిలైజేషన్‌ ఫోర్స్‌లో పాలుపంచుకుంటామని పాకిస్తాన అమెరికాకు మాట ఇచ్చింది. కానీ దానిని అమలు చేసే ఆసక్తి లేదు. అలా చేస్తే అంతర్గతంగా వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో దీనిని తప్పించుకోవడానికి ఆఫ్గానిస్తాన్‌పై దాడి మొదలు పెట్టింది. కానీ తాలిబాన్‌ ప్రతీకార దాడులతో లబోదిబో మంటుంది. గాజా స్థిరీకరణ బలగాల్లో చేరాలని అమెరికాకు హామీ ఇచ్చినా అమలు చేయకపోవటం, అంతర్గత వ్యతిరేకత పెరగడంతో ఆఫ్గాన్‌తో యుద్ధం మొదలు పెట్టింది. ఈ సంఘర్షణ పాకిస్తాన్‌ ఆర్థిక, సైనిక వ్యవస్థలకు తీవ్ర దెబ్బ తీస్తోంది.

వారం వ్యవధిలో దాడులు, ప్రతిదాడులు..
గత ఆదివారం పాకిస్తాన్‌ ఆఫ్గాన్‌ భూభాగంలో వైమానిక దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని ప్రకటించింది. అయితే సివిలియన్లు, పిల్లలు, మహిళల మరణాలు గుర్తించబడ్డాయి. మంగళవారం తాలిబాన్‌ సైన్యం ప్రతీకారంగా పాక్‌ పోస్టులను ఆక్రమించుకుంది. బుధవారం ఘర్షణ ఊపందుకుని, గురువారం పాక్‌ మరోసారి ఎయిర్‌ స్ట్రైకులు చేసింది. శుక్రవారం పాక్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌లు ప్రారంభించగా, శనివారం తాలిబాన్‌ కాందహార్, కాబూల్‌ ప్రాంతాలపై ప్రతిదాడి చేసింది. ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్‌ వైమానిక దళం లేకపోయినా డ్రోన్‌లతో ఇస్లామాబాద్, ఫైజాబాద్‌ లక్ష్యాలు చేసింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ భారత్‌ వైపు మొహరించబడటంతో నష్టాలు తప్పలేదు. ఆదివారం ఖైబర్‌ పక్తుంఖ్వా, బలూచిస్తాన్‌ సైనిక స్థావరాలు, నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భీకర దాడులు చేసి ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది.

అమెరికా ఒత్తిళ్లు తప్పించుకోవడానికి డైవర్షన్‌..
గాజా అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల్లో పాలుపంచుకుంటామని అమెరికాకు పాకిస్తాన్‌ హామీ ఇచ్చింది. కానీ అంతర్గత వ్యతిరేకత భయంతో అమలు వాయిదా వేసింది. దీన్ని మరచిపోయించేందుకు ఆఫ్ఘన్‌పై దాడులు ప్రారంభించి జాతీయవాద భావనలను రేకెత్తించాలని భావించింది. ఇప్పుడు అమెరికా ఈ డైవర్షన్‌ను గుర్తించి పాక్‌పై ఒత్తిడి పెంచింది.

నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడి..
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌ బేస్‌పై దాడి చేసి పాకిస్తాన్‌ను ఒత్తిడికి తీసుకువచ్చింది. ఆ దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు జరిగాయి. ఎయిర్‌ డిఫెన్స్‌ విఫలం కావడం పాక్‌ సైనిక వ్యవస్థలో గందరగోళం సృష్టించింది. ఇది ఇస్లామాబాద్‌ విధానాల తప్పిదానికి స్పష్టమైన సూచిక.

పాకిస్తాన్‌ అమెరికా, ఆఫ్ఘన్‌ మధ్య చిక్కుకుని రెండు వైపులా దబ్బలు తినుతోంది. ఆఫ్ఘన్‌ పోస్టులు ఆక్రమణ, డ్రోన్‌ దాడులు సైనిక నష్టాలను పెంచాయి. ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మద్దతు లేకపోతే ఇస్లామాబాద్‌ మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version