ENG vs NZ: వెల్డింగ్టన్ వేదికగా ప్రారంభమైన రెండవ టెస్టులో ముందుగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 12 పరుగులకే డకెట్(0) రూపంలో వికెట్ కోల్పోయింది. డకెట్ 0 పరుగులకే హెన్రీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 21 పరుగులు చేరుకున్నప్పుడు ప్రమాదకరమైన క్రావ్ లే(17) పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత జాకోబ్ బెతెల్ (16), రూట్(3) వెంట వెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత ఒల్లీ పోప్(66), బ్రూక్(123) అదరగొట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు ఏకంగా 174 పరుగులు జోడించారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. ఒకానొక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగుల వద్ద ఉన్న న్యూజిలాండ్ జట్టు.. పోప్, బ్రూక్ ధాటికి 217/5 వద్దకు చేరుకుంది. ఈ దశలో పోప్ ఓరూర్కే బౌలింగ్లో అవుట్ కావడంతో.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తడబడింది. కెప్టెన్ స్టోక్స్(2), వోక్స్(18), అట్ కిన్ సన్ (4), కార్సే(9) వెంట వెంటనే అవుట్ అయ్యారు.. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 280 పరుగుల వద్ద ముగిసింది.
బ్రూక్ కు రెండో సెంచరీ
ఈ సిరీస్లో బ్రూక్ అద్భుతమైన ఫాం కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్ లో అతడికి ఇది రెండవ సెంచరీ. న్యూజిలాండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ అతడు చేసిన సెంచరీ వల్ల ఇంగ్లాండ్ జట్టు కొత్త ఊపిరిలు ఊదింది. అతడికి పోప్ సహకరించడంతో ఇంగ్లాండ్ జట్టు పటిష్టమైన స్థితిలో నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో స్మిత్ 4, ఓరూర్కే 3, హెన్రీ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కార్సే రెండు వికెట్లు సాధించాడు. వోక్స్, అట్కిన్సన్, స్టోక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో లాతం(17), కాన్వే(11), రచిన్ రవీంద్ర (3), మిచెల్(6) నిరాశపరిచారు. ఓరూర్కే(0*), బ్లండిల్(7*) క్రీజ్ లో ఉన్నారు. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్ లోనూ పట్టు బిగించింది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమి నుంచి తప్పించుకునే సూచనలు కనిపించడం లేదని స్పోర్ట్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు, బ్యాటర్లు స్వదేశం వేదికగా జరుగుతున్న సిరీస్ లో విఫలమవుతుండడం నిరాశ పరుస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఇటీవల టీమిండియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో 3-0 తేడాతో విజయం సాధించింది. బలమైన టీం ఇండియాను స్వదేశంలో పడగొట్టింది. కానీ అదే జోరు తమ సొంత దేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ప్రదర్శించలేకపోతోంది.