IND VS AUS Pink Ball Test : మైదానంపై తేమ ఉండడం.. పచ్చిక కాస్త ఆరు మిల్లీమీటర్ల మందంలో కనిపించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవగానే బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించాడు. తొలి టెస్టులో బుమ్రా కూడా బ్యాటింగ్ వైపు ఆసక్తి కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు కుప్పకూలినప్పటికీ.. భారత జట్టు బౌలింగ్ తో అదరగొట్టింది. ముఖ్యంగా బుమ్రా సంచలన ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత జట్టుకు 46 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ లో భారత్ 400+ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. దానిని చేదించలేక ఆస్ట్రేలియా తడబడింది. 295 పరుగుల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి.. ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే ఇదే ఊపును అడిలైడ్ టెస్ట్ లోను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. తొలి టెస్ట్ కు దూరమైన రోహిత్, గిల్ ఈ మ్యాచ్ లోకి అందుబాటులోకి వచ్చారు. యశస్వి జైస్వాల్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. రోహిత్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
హెడ్ స్థానంలో అతడు..
ఆస్ట్రేలియా జట్టు హేజిల్ వుడ్ కు విశ్రాంతి ఇచ్చింది. అతడు గాయం బారిన పడటంతో.. అతని స్థానంలో బోలాండ్ రంగంలోకి దిగాడు. మూడు సంవత్సరాల విరామం తర్వాత బోలాండ్ తొలిసారి టెస్ట్ ఆడుతున్నాడు. గతంలో యాషెస్ కప్ లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అతనిపై ఆస్ట్రేలియా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.. ఈ మైదానంపై ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉండడంతో ఈసారి ఎలాగైనా గెలుస్తామని నమ్మకంతో ఉంది. తొలి టెస్ట్ లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఈ మ్యాచ్లో సత్తా చాటుతామని చెబుతున్నారు. ఇటీవల ప్రాక్టీస్ హోరాహోరీగా చేశారు.
దెబ్బ కొట్టిన స్టార్క్
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఖాతా ప్రారంభించకుండానే ఓపెనర్ యశస్వి జైస్వాల్ టీమిండియా ను దెబ్బ కొట్టాడు. స్టార్క్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. రాహుల్, గిల్ నిదానంగా ఆడుతున్నారు. కడపటి వార్తలు అందే సమయానికి తొలి వికెట్ 67 పరుగులు జోడించారు.. రాహుల్(35*), గిల్(30*) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.
తుది జట్లు ఇవే
రోహిత్ (కెప్టెన్) గిల్, యశస్విజయస్వాల్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, రాణా, బుమ్రా.
ఆస్ట్రేలియా
కమిన్స్(కెప్టెన్), బోలాండ్, స్మిత్, ఖవాజా, లబు షేన్, లయన్, స్టార్క్, మార్ష్.