https://oktelugu.com/

Palmistry : మీ అరచేతిలో ఈ గుర్తు ఉందా? అయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు

అరచేతిలో కొన్ని రకాల గుర్తులు ఉంటే వాళ్లంతా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని పండితులు చెబుతున్నారు. చేతిలో V గుర్తు ఉంటే మీకు అదృష్టం వస్తుందని పండితులు అంటున్నారు. మరి ఈ గుర్తు ఉన్నవారికి ఎలాంటి లక్ వస్తుందో చూద్దాం.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 26, 2024 / 12:29 AM IST

    Palmistry

    Follow us on

    Palmistry : భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలపై ముందుగానే తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. జాతకాలు నమ్మమని కొందరు చెబుతారు. కానీ మనసులో వాళ్లకు కూడా ఉంటుంది. రేపటి జాతకం ఎలా ఉంటుందనే విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఇలాంటి చెప్పేవారు నిజమో, అబద్ధమూ తెలియదు. కానీ వినడానికి చాలా ఆసక్తిగా చూస్తారు. భవిష్యత్తులో జరుగుతాయో లేదో అనేది తెలియదు. అయితే మన జీవితాన్ని మొత్తం నిర్థారించేది చేతి రేకలే అని పండితులు చెబుతుంటారు. జాతకం అడిగించడానికి వెళ్లినప్పుడు చాలామంది మొదటిగా చేతి రేఖలనే చూస్తారు. చేతి రేఖలను బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పే దానిని హర్ష సాముద్రిక అంటారు. ఈ జాతకాలను నమ్మి, వాటికి తగ్గట్లుగా పేరు మార్చుకునేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. అరచేతిలో కొన్ని రకాల గుర్తులు ఉంటే వాళ్లంతా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని పండితులు చెబుతున్నారు. చేతిలో V గుర్తు ఉంటే మీకు అదృష్టం వస్తుందని పండితులు అంటున్నారు. మరి ఈ గుర్తు ఉన్నవారికి ఎలాంటి లక్ వస్తుందో చూద్దాం.

    35 ఏళ్ల తర్వాత అదృష్టం
    కష్టం లేకుండా ప్రతిఫలం ఉండదు. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే చేతిలో V గుర్తు ఉన్నవారు కష్టపడుతుండాలి. వారి కష్టం ఎప్పటికీ వృథా కాదు. 35 ఏళ్ల తర్వాత వాళ్లకి అదృష్టం సిద్ధిస్తుంది. కష్టపడిన దాని కంటే రెట్టింపు ఫలితాలను పొందుతారని పండితులు అంటున్నారు.

    సంతోషంగా ఉంటారు
    చేతిపై ఈ గుర్తు ఉన్నవారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. కానీ వాటిని దాటుకుని సంతోషంగా బతుకుతారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారని పండితులు చెబుతున్నారు.

    విలాసవంతమైన జీవితం
    ఈ గుర్తు ఉన్నవారు విలాసవంతమైన జీవితం గడుపుతారు. కష్టాలు పడిన.. వాటిని ఎదుర్కొని మరి మంచి స్థాయిలో ఉంటారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. లక్ష్మీ కటాక్షం వీరికి సిద్ధిస్తుంది. పెద్ద ఉద్యోగాలు పొందడంతో పాటు వ్యాపారాల్లో కూడా రాణిస్తారని పండితులు అంటున్నారు. కష్టపడి డబ్బు సంపాదిస్తారు. 35 ఏళ్ల తర్వాత ఆ డబ్బు రెట్టింపు అవుతుందని.. విలాసవంతమైన జీవితం గడుపుతారని పండితులు అంటున్నారు.

    ధైర్యంగా ఉంటారు
    జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చిన భయపడరు. చాలా డేరింగ్‌గా ఉంటారు. లైఫ్‌లో ఏదైనా సాధించగలనని నమ్మతారు. వాళ్లకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. జీవితంలో సగం వయస్సు వచ్చే సరికి పూర్తిగా స్థిరపడిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజులా జీవిస్తారు.

    రాజకీయ రంగాల్లో రాణిస్తారు
    ఈ గుర్తు ఉన్నవాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించడంతో పాటు రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు. కష్టపడి విలువ, గౌరవం అన్ని సంపాదించుకుంటారు. ఎందులోనూ కూడా వీరితో పోటీపడలేరు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు, సూచనలు తీసుకోగలరు.