pregnancy : ఈరోజుల్లో చాలామంది సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గర్భం దాల్చకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన జీవనశైలి, తినే అలవాట్లు వంటి వాటివల్ల గర్భధారణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పూర్వ కాలంలో అయితే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం, మద్యం, ధూమపానం వంటివి మహిళలు తీసుకునేవారు కాదు. కానీ ఈరోజుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా వీటికి బానిసలు అవుతున్నారు. ఇవి ఒక కారణం అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకుని, పిల్లల ప్లానింగ్‌కి కూడా ఆలస్యం చేస్తున్నారు. ఇవన్నీ కారణాలు వల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా గర్భం దాల్చకపోతున్నారు. మరి ఏ ఏ సమస్యల వల్ల సంతాన సమస్యలు వస్తున్నాయో చూద్దాం.
మహిళలు గర్భం దాల్చకపోవడానికి కారణాలు
మహిళల్లో అండాలు ఉత్పత్తి కావడం, విడుదల కావడం వల్ల సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గర్భాశయం లోపల కణజాలం పెరగడం, పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు, అధికంగా బరువు, తక్కువ బరువు, పోషకాహారం లోపం, అధికంగా ధూమపానం, మద్యపానం వంటి వాటివల్ల కూడా మహిళలు గర్భధారణ సమస్యలతో బాధపడుతున్నారు. ఎంత ప్రయ్నతించిన గర్భం దాల్చకపోతే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.
పురుషుల్లో సంతాన సమస్యలు
పురుషులకు వీర్యంలో శుక్రకణాలు తక్కువగా లేదా శుక్రకణాల చలనం లేకపోవడం, సాధారణ ఆకారంలో లేకపోవడం, వృషణాలు పనిచేయకపోవడం, వీర్యంలోకి శుక్రకణాలు చేరకుండా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటితో పాటు మందులు వాడటం, మద్యపానం, ధూమపానం, టెస్టోస్టిరోన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యల వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇద్దరిలో రాకపోవడానికి కారణాలు
మహిళలు, పురుషుల్లో రాకపోవడానికి ముఖ్య కారణం.. గర్భనిరోధక పద్ధతులను వాడటం, వయస్సు పెరగడం, వ్యక్తిగత సమస్యల వల్ల పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టాలంటే ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వ్యాయామం చేస్తుండాలి. ఎక్కువగా ఒత్తిడికి గురికాకూడదు. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే.. పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. అలాగే తాజా పండ్లు, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. స్త్రీ, పురుషులిద్దరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పురుషులు అయితే అసలు మద్యం, ధూమపానం తీసుకోకూడదు. వీటివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.