Homeలైఫ్ స్టైల్Children Habits  : పిల్లలకు ఈ నాలుగు అలవాట్లు ఉంటే.. భవిష్యత్తులో కష్టమే!

Children Habits  : పిల్లలకు ఈ నాలుగు అలవాట్లు ఉంటే.. భవిష్యత్తులో కష్టమే!

Children Habits : పిల్లలు ఎలాంటి కల్మషం లేనివారు. అందుకే పిల్లలను దేవుళ్లతో పోలుస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్క క్షణం కూడా వాళ్లను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకున్న సరే.. వాళ్లు కొన్ని చెడు అలవాట్లకు దగ్గర అవుతుంటారు. ఎందుకంటే చిన్న వయస్సులో వారికి మంచి ఏది, చెడు ఏది తెలియదు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులే దగ్గర ఉండి చెప్పాలి. చిన్నప్పుడు వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో.. వాటి ఆధారంగానే వారు ఉంటారు. తల్లిదండ్రులను చూసే పెద్దలు నేర్చుకుంటారని పెద్దలు అంటుంటారు కదా. పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏవైనా తప్పులు చేస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదా? అని అంటుంటారు. ఇలాంటి మాటలు పెద్దయిన తర్వాత భరించకూడదంటే.. మొక్క దశలో ఉన్నప్పుడే పిల్లలను కంట్రోల్‌లో పెట్టాలి. పిల్లలు ఏం చేసిన కూడా తల్లిదండ్రులు గమనించాలి. వారు చేసేది తప్పా? లేదా? అనేది తెలుసుకుని తల్లిదండ్రులు నేర్పించాలి. అయితే పిల్లలు ఎక్కువగా కొన్ని అలవాట్ల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తప్పు ఒప్పుకోకపోవడం
పిల్లలు తప్పు చేసిన ఒప్పుకోరు. తల్లిదండ్రులు లేదా బయట వాళ్లు తిడతారు ఏమోనని భయంతో అబద్ధాలు చెబుతారు. ఒక తప్పును కప్పి ఉంచడానికి ఆడిన అబద్ధం తప్పులు చేస్తుంటారు. చిన్నప్పుడు చేసిన చిన్న తప్పులు తెలిసో, తెలియక చేస్తారు. కానీ పెద్దయిన తర్వాత చిన్న తప్పులు కాస్త పెద్దవి అవుతాయి. కాబట్టి పిల్లలు అబద్ధాలు ఆడకుండా అలవాటు చేయాలి. ఏ విషయాన్ని అయిన ధైర్యంగా చెప్పే విధంగా ఉండాలి. ముఖ్యంగా తప్పు చేసిన ఒప్పుకోవాలి. అలా పిల్లలను తయారు చేస్తే జీవితంలో వాళ్లు ఎలాంటి తప్పులు చేయకుండా గొప్పగా ఉంటారు.

వాయిదా వేయడం
పిల్లలకు బద్ధకం, పనులు వాయిదా వేయడం వంటి అలవాట్లు ఉండకూడదు. ఏ పని అయిన చెప్పిన వెంటనే చేసే విధంగా ఉండాలి. ఉదాహరణకు హోమ్ వర్క్ పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే చేసే విధంగా వాళ్లను తయారు చేయాలి. కుటుంబ బాధ్యతలు తెలిసేలా పిల్లలతో వ్యవహరించాలి. అప్పుడే వాళ్లు ఎలాంటి వాయిదా లేకుండా ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేస్తారు.

ఇతరుల అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వడం
ప్రతి ఒక్కరిలో లోపాలు అనేవి సహజం. కొందరు పిల్లలకు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావని అంటుంటారు. దీంతో పిల్లలు బాధపడతారు. ఇలా ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్‌ ఇవ్వద్దని చెప్పండి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడతారు. కాబట్టి వీటిని పట్టించుకోకుండా పిల్లలను నచ్చినట్లు ఉండమని చెప్పండి.

కబుర్లు చెప్పుకోకపోవడం
కొందరు పిల్లలు కుటుంబ సభ్యులతో కలవకుండా ఒంటరిగా ఉంటారు. ఇలా ఉండటం వల్ల పిల్లలు ఏవైనా చేస్తే తల్లిదండ్రులకు తెలియదు. కాబట్టి పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి కబుర్లు చెప్పుకునే విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ల మనసులో ఉన్న భావాలు తెలుస్తాయి. లేకపోతే వారు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంటుంది.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version