Wearing Jeans: మనలో చాలామందికి జీన్స్ ధరించడం చాలా ఇష్టం. ఆ జీన్స్ లోనూ ఎన్నో రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. స్కిన్ టైట్, బూట్ కట్, పెన్సిల్ కట్, పేపర్ కట్, సిక్స్ ప్యాక్, ఆర్మీ మోడల్.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని కొన్ని వేల రకాల మోడల్స్ లో జీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ జీన్స్ అనే వస్త్రం పాశ్చాత్య దేశాలలో తయారయింది. మనదేశంలోకి చాలా ఏళ్ళ క్రితమే వచ్చింది. మందమైన వస్త్రం, ఎన్ని సంవత్సరాలైనా మన్నుతుంది. పైగా దీనిని ధరిస్తే శరీరానికి సరికొత్త ఆకృతి లభిస్తుంది. అందువల్లే యువత నుంచి సీనియర్ సిటిజన్ల వరకు జీన్స్ ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఈ జీన్స్ తయారీలో అధునాతన పద్ధతులను అవలంబిస్తారు. అయితే అవి పర్యావరణానికి హాని చేకూర్చుతాయి.. వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే..
సాధారణంగా ఒక జత జీన్స్ తయారు చేయాలంటే 2.5 కిలోల కార్బన్ డై యాక్సైడ్ విడుదలవుతుంది. ఎందుకంటే జీన్స్ అనేది కృత్రిమ వస్త్రం. దానిని అనేక కెమికల్స్ తో తయారు చేస్తారు. అందువల్ల ఆ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఒక కారులో 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎంత కార్బన్ డై యాక్సైడ్ విడుదలవుతుందో.. ఒక జత జీన్స్ తయారు చేస్తే ఆ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది.
ఇక చైనాలోని గాంగ్ డాంగ్ యూనివర్సిటీ అధ్యాపకుల అధ్యయనం ప్రకారం సగటున జీన్స్ ను ఏడుసార్లు ధరిస్తున్నారట.. ఫలితంగా వాతావరణంలో 11 రెట్లు పెరుగుతోందట. 95 నుంచి 99 శాతం వరకు వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడానికి జీన్స్ వేసుకోవడమే కారణమట. కాలుష్యం మాత్రమే కాదు జీన్స్ తయారీకి విపరీతంగా నీటిని వాడుతుంటారు. ఒక జత జీన్స్ తయారు చేయడానికి తక్కువలో తక్కువ 50 నుంచి 90 లీటర్ల నీటిని వినియోగిస్తారు. ఈ నీటిలో అనేక రకాల రసాయనాలు కలపడం వల్ల.. ఆ నీరు మొత్తం కలుషితమవుతుంది. అలా జీన్స్ తయారు చేసిన తర్వాత మిగిలిన నీటిని నేలపైనే పారబోస్తారు. అవి అంతిమంగా భూగర్భ జలాల కలుషితానికి కారణమవుతున్నాయి.
మారుతున్న ఫ్యాషన్ ట్రెండును బట్టి రకరకాల జీన్స్ తయారు చేయడం వల్ల మరింత ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోంది. దీనికి తోడు జీన్స్ తయారీలో వివిధ కృత్రిమ పదార్థాలు వాడటం వల్ల.. అవి మనుషుల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు జీన్స్ ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే జీన్స్ తయారీలో వాడిన రసాయనాల వల్ల వాతావరణంలో ఉన్న కణాలు అతుక్కుంటాయి. దీనివల్ల జీన్స్ పై ప్రమాదకర పదార్థాలు పేరుకు పోతాయి. అవి అంతిమంగా గాలి లేదా ఇతర వాటి ద్వారా మన శరీరానికి ప్రవేశించి రకరకాల వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల జీన్స్ ధరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది అంటున్నారు పర్యావరణవేత్తలు..