spot_img
Homeలైఫ్ స్టైల్Amazon Prime Day Sale 2026: త్వరలో Amazon Prime Day సేల్.. భారీగా తగ్గింపు...

Amazon Prime Day Sale 2026: త్వరలో Amazon Prime Day సేల్.. భారీగా తగ్గింపు ధరలు.. డిస్కౌంట్లు..

Amazon Prime Day Sale 2026: అమెజాన్ ఇండియా తన ప్రతిష్టాత్మక ‘ప్రైమ్ డే’ (Prime Day) సేల్‌ను ఈ ఏడాది జూలైలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది భారతదేశంలో జరగబోయే 10వ ఎడిషన్ కావడం విశేషం. కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారుల కోసం మాత్రమే ఉద్దేశించి దీనిని నిర్వహిస్తంది. 48 గంటల మెగా సేల్‌లో, ఎలక్ట్రానిక్స్ నుంచి నిత్యావసర వస్తువుల వరకు వేల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. దీంతో ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు సిద్ధం కావాలని తెలిపింది. సేల్స్ లో ఎలాంటి వస్తువులు ఉంటాయంటే?

గ్యాడ్జెట్స్ , ఎలక్ట్రానిక్స్‌:
ఈసారి సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు ,ఆడియో డివైజ్‌లపై ఊహించని ఆఫర్లు ఉండబోతున్నాయి. Apple, Samsung, OnePlus వంటి దిగ్గజ బ్రాండ్ల ఫోన్లపై భారీ ధర తగ్గింపులతో పాటు, అమెజాన్ సొంత ఉత్పత్తులైన Echo (Alexa), Fire TV Stick, Kindle డివైజ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కొత్తగా లాంచ్ అయ్యే పలు గ్యాడ్జెట్స్ కూడా ఈ సేల్ ద్వారానే మొదటిసారి అందుబాటులోకి రానున్నాయి.

ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్:
ఫ్యాషన్ ప్రియుల కోసం దుస్తులు, పాదరక్షలు , యాక్సెసరీలపై 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. ఇక కిచెన్, హోమ్ అప్లయన్సెస్ విభాగంలో మిక్సీలు, ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు నో-కాస్ట్ EMI సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. పండుగ సీజన్‌కు ముందే ఇల్లు సర్దుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

బ్యాంక్ ఆఫర్లు :
కేవలం ధర తగ్గింపులే కాకుండా, ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ , డెబిట్ కార్డులపై 10శాతం ప్లాట్ డిస్కౌంట్ ఉండనుంది. దీనికి తోడు అమెజాన్ పే (Amazon Pay) ద్వారా చెల్లింపులు చేసే వారికి ప్రత్యేక రివార్డులు. ప్రైమ్ మెంబర్లకు ‘సేమ్ డే’ లేదా ‘వన్ డే’ డెలివరీ సౌకర్యం ఉండనుంది. సేల్ సందర్భంగా కొత్త సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డే అనేది కేవలం షాపింగ్ మాత్రమే కాదు, ప్రైమ్ మెంబర్లకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన ట్రీట్. మీరు ఇంకా మెంబర్‌షిప్ తీసుకోకపోతే, సేల్ ప్రారంభానికి ముందే సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ఉత్తమం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper