Homeఅంతర్జాతీయంMaduro dares Trump : మదురో చేసిన ఆ పని వల్లే ట్రంప్ కు కోపం.....

Maduro dares Trump : మదురో చేసిన ఆ పని వల్లే ట్రంప్ కు కోపం.. అరెస్ట్!

Maduro dares Trump : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro) అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనను అరెస్ట్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వెనిజుల అధ్యక్షుడి అరెస్ట్ రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనక అమెరికా తీవ్రమైన కసరత్తు చేసింది. చాలా రోజులపాటు ఎదురుచూసింది. కొన్ని సందర్భాలలో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసింది. వెనిజులా అధ్యక్షుడి […]

Maduro dares Trump : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro) అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనను అరెస్ట్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వెనిజుల అధ్యక్షుడి అరెస్ట్ రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనక అమెరికా తీవ్రమైన కసరత్తు చేసింది. చాలా రోజులపాటు ఎదురుచూసింది. కొన్ని సందర్భాలలో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేసింది.

వెనిజులా అధ్యక్షుడి అరెస్టుకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్లో ఉంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం వెనిజుల అధ్యక్షుడు మదురో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి సవాల్ విసిరారు. దమ్మూ ధైర్యం ఉంటే తనను అరెస్టు చేయాలన్నారు. మదురో విసిరిన సవాల్ ను అమెరికా మనసులో పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే అమెరికా అదును చూసి దెబ్బ కొట్టింది. మదురో ను వేగంగా అధ్యక్ష భవనంలోకి వెళ్లి అధ్యక్ష భవనంలోకి వెళ్లి అరెస్ట్ చేసింది.

వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడానికి అమెరికా ఏకంగా వందల కోట్ల కేటాయించింది. ఇటీవల దానిని ఏకంగా 450 కోట్లకు పెంచింది. దానిపై మదురో తీవ్రంగా స్పందించారు. ” మీరు నాకోసం వస్తారా.. నేను అధ్యక్ష భవనంలోనే ఉన్నాను. మీకు దమ్ముంటే వచ్చి నన్ను తీసుకెళ్లండి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మీకోసం ఎదురు చూస్తున్నానని” మదురో భావోద్వేగంతో సవాల్ విసిరారు.

మదురో అమెరికన్ ఉద్దేశించి విసిరిన సవాల్ కు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయనకు ఇప్పటికి అవకాశం వచ్చిందని వ్యంగ్యంగా విమర్శించింది. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. అవి అమెరికన్ పౌరులకు ఇబ్బంది కలిగిస్తే.. ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతుందని వైట్ హౌస్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper