Sandhya Theatre Secret Camera : సంధ్య థియేటర్(Sandhya Theatre) అనే పేరు నేషనల్ వైడ్ గా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూవీ లవర్స్ చూస్తే ఇక్కడే మొదటి రోజు మొదటి ఆట చూడాలి అని అనుకునేంత స్థాయి ఈ థియేటర్ కి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్ పేరు తెలియని మూవీ లవర్ ఉండరు. కానీ 2024 వ సంవత్సరం లో ఈ థియేటర్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. పుష్ప 2 ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ రావడం, ఆయన రావడం తో తొక్కిసలాట ఘటన జరిగి ఒక మహిళా ప్రాణాలు కోల్పోవడం, అదే విధంగా ఆ మహిళా కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం, ఈ ఘటన కి అల్లు అర్జున్ ని తప్పుబడుతూ పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి ఈ థియేటర్ ని నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యేలా చేశాయి.
అయితే ఇప్పుడు మరోసారి ఈ థియేటర్ పేరు వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి హైదరాబాద్ సంధ్య థియేటర్ కాదు, బెంగళూరు లో ఉండే సంధ్య థియేటర్. బెంగళూరు లో నివసించే తెలుగు వాళ్ళు అత్యధిక శాతం ఈ థియేటర్ లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే నేడు విక్టరీ వెంకటేష్ ఆల్ టైం క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమాని చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో, మహిళలు వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉండడాన్ని గమనించారు. ఈ విషయం వెలుగులోకి రాగానే థియేటర్స్ కి వచ్చిన జనాలు థియేటర్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేయడం తో తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగం లోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఒక థియేటర్ లో సీక్రెట్ కెమెరా, అది కూడా వాష్ రూమ్ లో పెట్టేంత అవసరం ఏముంది?.
థియేటర్ సిబ్బంది కావాలని ఇలాంటి పని చేసిందా?, లేదా ఎవరైనా ఆకతాయిలు కావాలని ఇలాంటి చిల్లర పనులు చేశారా అనే కోణం లో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఈ తప్పు ఎవరు చేసినా సరే, వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, లేడీస్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలను పెట్టి ఇప్పటికే ఎంత మందిని వీడియోలు తీశారో భయం వేస్తోంది అంటూ అక్కడికి వచ్చిన మహిళా ప్రేక్షకులు భయపడుతున్నారు. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
సంధ్య థియేటర్లో సీక్రెట్ కెమెరా కలకలం#nuvvunaakunachav రీ-రిలీజ్ సందర్భంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో, లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాను గుర్తించిన మహిళ.
విషయం వెలుగులోకి రాగానే థియేటర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న… pic.twitter.com/12zomKFgHu
— greatandhra (@greatandhranews) January 5, 2026