Homeజాతీయ వార్తలుVande Mataram Song Controversy: తమిళ వాసనలు పోనిచ్చుకోని టీవీకే విజయ్.. ఇవే తగ్గించుకుంటే మంచిది..

Vande Mataram Song Controversy: తమిళ వాసనలు పోనిచ్చుకోని టీవీకే విజయ్.. ఇవే తగ్గించుకుంటే మంచిది..

Vande Mataram Song Controversy: తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా ఒక రకమైన మూర్ఖత్వం కొనసాగుతూ ఉండేది.. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నేతలు ద్రావిడ వాదాన్ని అక్కడి ప్రజల్లో నూరి పోశారు. ఫలితంగా ఆ పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చేవి. అయితే డిఎంకె లేకుంటే అన్నా డీఎంకే మాత్రమే అక్కడ పరిపాలన సాగించేవి. హిందీకి అక్కడ వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చాలామంది రాజకీయంగా ఎదిగారు. రాజకీయంగా ఎదిగినప్పటికీ రాజకీయంగా ఆ నేతలు ఎదిగినప్పటికీ.. […]

Vande Mataram Song Controversy: తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా ఒక రకమైన మూర్ఖత్వం కొనసాగుతూ ఉండేది.. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల నేతలు ద్రావిడ వాదాన్ని అక్కడి ప్రజల్లో నూరి పోశారు. ఫలితంగా ఆ పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చేవి. అయితే డిఎంకె లేకుంటే అన్నా డీఎంకే మాత్రమే అక్కడ పరిపాలన సాగించేవి. హిందీకి అక్కడ వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఆసరాగా చాలామంది రాజకీయంగా ఎదిగారు.

రాజకీయంగా ఎదిగినప్పటికీ
రాజకీయంగా ఆ నేతలు ఎదిగినప్పటికీ.. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ.. హిందీ మీద వ్యతిరేకతను తగ్గించలేదు. పైగా తమిళనాడు రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేసేవారు. ఈ మూర్ఖత్వం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే.. మనదేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ మరణానికి కారణమైన ఎల్టిటిటిఈ ఉగ్రవాదులకు తమిళనాడులో షెల్టర్ ఇచ్చే అంతగా.. పైగా అన్నా డీఎంకే, డీఎంకే పైకి వేరువేరుగా కనిపించినప్పటికీ.. అంతర్గతంగా ఆ రెండు పార్టీలు ఒకటే. వాటి మూల సిద్ధాంతం కూడా ఒకటే. అయితే మీరు లేకుంటే మేము అన్నట్టుగానే వారి వ్యవహారం ఉంటుంది. మూడో పార్టీకి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఇవ్వద్దు అన్నట్టుగా వారి విధానం సాగుతూ ఉంటుంది.

విజయ్ వచ్చిన తర్వాత
విజయ్ టీవీ కే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడు రాజకీయాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ద్రావిడ వాదం లేకుండానే అక్కడి ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పును వెల్లడించారు. ఫలితంగా టీవీ కే అక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించింది.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కూడా అచ్చం ఆ ద్రావిడ పార్టీల మాదిరిగానే పరిపాలన సాగిస్తున్నారు.. ముఖ్యంగా తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతర గీతాన్ని విజయ్ ప్రభుత్వం తొలగించింది. తమిళ్ తాయి వళ్లు(రాష్ట్ర గీతం), జనగణమన (జాతీయ గీతం) తో అక్కడి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వందేమాతరం గేయం దేశ ప్రజల్లో స్వాతంత్ర్య ఉద్యమకాంక్షను బలంగా చాటింది. బకించంద్ర చటర్జీ రాసిన ఆ గేయం కోట్లాదిమంది భారతీయులకు స్ఫూర్తి నింపింది. అటువంటి గేయాన్ని విజయ్ ప్రభుత్వం తొలగించడం నిజంగా మూర్ఖత్వానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper