Homeలైఫ్ స్టైల్Toll plaza rules : టోల్ ప్లాజా వద్ద ఆ ఇబ్బందా? మీకు ఈ రూల్...

Toll plaza rules : టోల్ ప్లాజా వద్ద ఆ ఇబ్బందా? మీకు ఈ రూల్ తెలుసా?

Toll plaza rules : దసరా సెలవులు వచ్చేసాయి. పాఠశాలలకు 10 రోజులకు మించి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు వస్తే చాలు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్లాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. నగరాలలో స్థిరపడినవారు పిల్లలకు సెలవు రావడంతో ఇంత ఊర్లకు వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఇలా అందరూ అనుకుంటారు కాబట్టి టోల్ ప్లాజా ల వద్ద భారీగా రద్దు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. ముందు ఉన్న వాహనాలు వెళ్తేనే […]

Toll plaza rules : దసరా సెలవులు వచ్చేసాయి. పాఠశాలలకు 10 రోజులకు మించి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు వస్తే చాలు పిల్లలు అమ్మమ్మగారింటికి వెళ్లాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. నగరాలలో స్థిరపడినవారు పిల్లలకు సెలవు రావడంతో ఇంత ఊర్లకు వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఇలా అందరూ అనుకుంటారు కాబట్టి టోల్ ప్లాజా ల వద్ద భారీగా రద్దు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. ముందు ఉన్న వాహనాలు వెళ్తేనే టోల్ ప్లాజాను దాటి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. సెలవు దినాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టోల్ ప్లాజాలు ఎదురుచూపులు చూడలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

టోల్ ప్లాజాల వల్ల రద్దీ చాలామందిని ఇబ్బందికి గురిచేస్తుంది. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంది. సాధారణంగా పండగల పూట సొంత గ్రామాలకు వెళ్లాలనే ఆత్రుత చాలా మందిలో ఉంటుంది. అటు ముందుకు వెళ్లలేక…ఇటు వెనక్కి వెళ్లడానికి మనసు ఒప్పక ఇబ్బంది పడుతుంటారు. అదే అటువంటి వారి కోసం టోల్ ప్లాజాలో ఒక నిబంధన ఉంది.. ఆ నిబంధన టోల్ ప్లాజా వద్ద ఎదురుచూసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జాతీయ రహదారుల మీద ప్రయాణించేవారు టోల్ ప్లాజాల వద్ద చిక్కుపోయినప్పుడు అక్కడ మినిమం వెయిటింగ్ టైం అనే రూల్ ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సర్కులర్ ప్రకారం టోల్ బూత్ వద్ద ఒక వాహనం 10 సెకండ్లకు మించి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోతే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. క్యూ 100 మీటర్ల లోపల వచ్చేవరకు ముందున్న వాహనాలను ఫీజు లేకుండానే వదిలేయాలి.

వాస్తవానికి ఈ నిబంధన చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా వసంత గ్రామాలకు వెళ్లాలి అనే ఆతృతలో దానిని పట్టించుకోరు. ఎంత కష్టమైనా సరే టోల్ ప్లాజాలో ఎదురు చూసి.. తమకు కాస్త వెసలు బాటు లభించగానే ముందుకు వెళ్తుంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు టోల్ ప్లాజా లో దురుసుగా ప్రవర్తించినా.. అదనపు రుసుము వసూలు చేసినా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అత్యవసర వైద్య విభాగాన్ని.. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉచితంగా వాడుకునే సౌలభ్యం ఉంటుంది. వాహనాల టైర్లలో గాలి నింపుకోవడానికి.. అంబులెన్స్ సౌకర్యాలను ఉపయోగించుకునే హక్కు కూడా ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper