rajamouli love story : దర్శక ధీరుడు రాజమౌళి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఐతే తన సక్సెస్ వెనక తన భార్య అయిన రమా ప్రోత్సాహం చాలా ఉందని పలు సందర్భాల్లో రాజమౌళి చెబుతూ ఉండటం విశేషం… ఎందుకంటే రాజమౌళి ఎక్కువగా టెన్షన్ తీసుకోలేడు. దాంతో రమా సిచువేషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని రాజమౌళిని టెన్షన్ ఫ్రీ చేస్తుందని పలు సందర్భాల్లో తను తెలియజేయడం విశేషం…ఇక రాజమౌళి రమా లది ప్రేమ పెళ్లి అనే విషయం మనందరికి తెలిసిందే..ముందుగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు… అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నేను’ సినిమాను చూశారట. ఈ సినిమాని వీళ్ళిద్దరూ పదిసార్లు థియేటర్లో చూశారట.
మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న ప్రేమ చాలా గొప్పదని పలు సందర్భాల్లో రాజమౌళి సైతం మాట్లాడాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను తీసిన తేజ టాలెంటెడ్ డైరెక్టర్ అని కూడా తను తెలియజేయడం విశేషం…ఆ తర్వాత మొత్తానికైతే రాజమౌళి రమా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు…
ఇక వీళ్లకు ‘కార్తీకేయ’ అనే కొడుకు ఉన్నాడు… తను ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూసుకుంటున్నాడు. రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాకు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరికి లేని సక్సెసులు, ఎవ్వరు సాధించలేని రికార్డులను సైతం ఆయన దక్కించుకున్నాడు…ఇక తన ప్రతి సక్సెస్ వెనక తన కుటుంబం ఉంటుందని రాజమౌళి చాలా గర్వంగా చెబుతుంటాడు…