
వాహనదారులకు చమురు కంపెనీలు షాన్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా తాజాగా లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, లీటర్ డీజిల్ లో 26 పైసలు పెంచాయి. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్, మధ్యప్రదేశ్ లోని భోపాల్ పై లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటగా.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.94, లీటర్ డీజిల్ రూ. 84.89కి చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 100.19, డీజిల్ రూ. 92.17కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 97.63, లీటర్ డీజిల్ రూ. 92.54కు చేరింది.