హీరో నిఖిల్.. ఈ టాలీవుడ్ యంగ్ హీరో విలక్షణ, మంచి కథా వస్తువుతో సినిమాలు తీస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. భిన్నమైన సినిమాలకు నిఖిల్ కేరాఫ్ అడ్రస్. ఈసారి కూడా అలాంటి ప్రయోగమే చేశాడు.
తాజాగా నిఖిల్ ‘18 పేజీస్’ చిత్రంతో మనముందుకు వస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యప్రతాప్ అనే కొత్త దర్శకుడు భిన్నమైన కథతో మూవీ తీస్తున్నాడు.
విశేషం ఏంటంటే టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జూన్ 1న నిఖిల్ బర్త్ డే సందర్భంగా 18 పేజీస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను హమీరో నిఖిల్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. డిఫెరెంట్ లుక్ తో నిఖిల్ ఇందులో కనిపిస్తున్నారు. చూస్తుంటే మంచి కథ, కథనం ఉన్నట్టుగా తెలుస్తోంది.
18 Pages…
When Feelings Burn 🔥❤
1st Look on 1st June… @aryasukku @GA2Official #AlluAravind #BunnyVas @dirsuryapratap @SukumarWritings @anupamahere pic.twitter.com/uGsbi3x0aL— Nikhil Siddhartha (@actor_Nikhil) May 28, 2021