నీరు పచ్చగా.. దుర్వాసన.. గంగానదిపై ఆందోళన

కరోనా కల్లోలంలో ఇటీవల చాలా మృతదేహాలు గంగానదిలో తేలియాడాయి. అంత్యక్రియలు చేయలేక కోవిడ్ మృతదేహాలను గంగానదిలో వదిలేశారన్న విమర్శలు వచ్చాయి. యూపీ నుంచి బీహార్ వరకు వందల మృతదేహాలు గంగానదిలో తేలియాడడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అయితే ఇప్పుడు ఆ ఉపద్రవాలతో గంగానది పూర్తిగా కలుషితమైపోయినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లాల్లో గంగానది నీరు గత కొన్ని రోజులుగా పచ్చగా కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. నీటి రంగులో మార్పులు చూసి.. దుర్వాసన చూసి ప్రజలు […]

Written By: NARESH, Updated On : May 29, 2021 9:03 am
Follow us on

కరోనా కల్లోలంలో ఇటీవల చాలా మృతదేహాలు గంగానదిలో తేలియాడాయి. అంత్యక్రియలు చేయలేక కోవిడ్ మృతదేహాలను గంగానదిలో వదిలేశారన్న విమర్శలు వచ్చాయి. యూపీ నుంచి బీహార్ వరకు వందల మృతదేహాలు గంగానదిలో తేలియాడడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.

అయితే ఇప్పుడు ఆ ఉపద్రవాలతో గంగానది పూర్తిగా కలుషితమైపోయినట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లాల్లో గంగానది నీరు గత కొన్ని రోజులుగా పచ్చగా కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. నీటి రంగులో మార్పులు చూసి.. దుర్వాసన చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందులో స్నానానికి వెనుకాడుతున్నారు.

గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ లో ఫస్ట్ వేవ్ సందర్భంగా కాలుష్య కోరల్లో ఉన్న గంగానది క్లీన్ అయిపోయింది. అయితేఇప్పుడు దుర్వాసనతో నిండిపోవడం ప్రమాద సంకేతంగా చెబుతున్నారు.

అయితే గంగానదిలో ఈ కాలుష్యం వల్ల మైక్రోసిస్టస్ ఆల్గే పెరిగిందని.. అదే ఆకుపచ్చ రంగుకు కారణమని బనారస్ యూనివర్సిటీ గంగా పరిశోధన కేంద్రం అధ్యక్షుడు త్రిపాఠి తెలిపారు.

గంగానదిలో నీరు ఆకుపచ్చ రంగులోకి మార్చడానికి ప్రధాన కారణాల్లో వర్షం కూడా ఒకటి అని అంటున్నారు.లవణాలు పెరిగినప్పుడు గంగానదిలో ఆకుపచ్చ ఆల్గే ఎక్కువగా కనిపిస్తుంది. వర్షంతో నీరు గంగానదిలో కలుస్తుంది. దాంతో ఈ ఆల్గే పెరిగి ఆకుపచ్చగా మారుతోందని తేల్చారు.

వారణాసిలోని 84 ఘాట్లలో చాలా వరకు గంగానీరు పచ్చగా కనిపిస్తోంది. నీటిలో ఈదితే చర్మ వ్యాధులు వస్తాయని.. నీరు తాగితే కాలేయం దెబ్బతింటుందని అంటున్నారు. అయితే మార్చి మే మధ్య ఇలా పచ్చ మారడం సహజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.