Homeబిజినెస్OLA S1 X Plus 5.2 kWh : OLA కొత్త స్కూటర్.. ఫీచర్స్ చూస్తే...

OLA S1 X Plus 5.2 kWh : OLA కొత్త స్కూటర్.. ఫీచర్స్ చూస్తే కొనకుండా ఉండలేరు

OLA S1 X Plus 5.2 kWh : ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న OLA కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకువస్తుంది. ప్రస్తుత వినియోగదారులు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ఈ కంపెనీ లేటెస్ట్ గా సింగిల్ చార్జింగ్తో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే ఇందులో నేటి తరం యూత్ తో పాటు రోజువారి వినియోగదారులు ఆకర్షించేలా ఫీచర్లో ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఈ స్కూటర్ విశేషాలు ఏంటంటే..?

OLA కంపెనీ కొత్తగా మార్కెట్లోకి S1 X+. 5.2 kWh అనే మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో 5.2 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. గంటకు 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దీనిపై దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఈ బ్యాటరీ చార్జింగ్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ మాత్రమే కాకుండా నేటి తరం యూత్ తో పాటు రోజువారి ఉద్యోగులకు అనుగుణంగా ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్లో 7 అంగుళాల TFT కలర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కనిపిస్తుంది. ఇందులో నావిగేషన్ తో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్, ఫోన్ కాల్స్ , రిమోట్ లాక్, టాకింగ్ వంటి ఫీచర్లో ఉన్నాయి.

ఈ స్కూటర్లో ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా దీని డిజైన్ కూడా వెరైటీ లుక్ తో ఆకాశిస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి స్కూటర్ కూడా ఇలాంటి మోడల్ డిజైన్ ను కలిగి ఉండలేదు. ఈ స్కూటర్కు ఎల్ఈడి లైటింగ్, 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన బ్రేకింగ్ సిస్టం, డిస్క్ బ్రేకింగ్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే ఇందులో రీ జనరేటు బ్రేకింగ్ బ్యాటరీని కూడా చేర్చారు. ఈ బ్యాటరీ 3 మోడ్స్ లో పనిచేస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.

ఈ స్కూటర్ ధర రూ.1.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే దీని బ్యాటరీ కి ఎన్ని సంవత్సరాల వారంటీని కూడా అందిస్తున్నారు. లక్ష కిలోమీటర్ల వరకు లైఫ్ ను కూడా అందిస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు ఆఫర్లో దీనిని పొందవచ్చు. దీనిని పొందడానికి అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకుంటే ఏప్రిల్ చివరి నుంచి డెలివరీ అవుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper