Heritage Group Odisha: హెరిటేజ్ గ్రూపు( Heritage group).. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల సారధ్యంలో దిగ్విజయంగా నడుస్తున్న పాల ఉత్పత్తుల సంస్థ. ఏటా నికర ఆదాయంతో ముందుకు దూసుకుపోతోంది ఈ సంస్థ. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, డైరీ వైట్నర్, స్కిమ్ మిల్క్ పౌడర్ వంటివి ఈ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి. మరోవైపు తాజా పండ్లు, కూరగాయలు, బేకరీ ఉత్పత్తులు, తృణధాన్యాలు, పప్పులు, స్టే పుల్స్, సుగంధ ద్రవ్యాలు వంటి ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులు కూడా ఈ సంస్థ నుంచి నడుస్తున్నాయి. విదేశాల్లో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయితే తరచూ హెరిటేజ్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఒడిస్సా లోని జైపూర్ లో హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ పై అక్కడ ఆహార తనిఖీ నియంత్రణ అధికారులు నిషేధం విధించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: మెట్ గాలాలో మెరిసిన షారుఖ్.. ఆయన ధరించన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
* జైపూర్ లో తనిఖీలు..
ఒడిస్సాలో ( Odisha ) సైతం హెరిటేజ్ ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో జైపూర్ లో ఆహార తనిఖీ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కాలం చెల్లిన పాలు, ఉత్పత్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఒడిస్సాలో ఏపీ పరువు పోయిందని.. హెరిటేజ్ ఉత్పత్తులను అక్కడ ప్రభుత్వం నిషేధించిందని వైసీపీ ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే దీనిపై ఒడిస్సా ప్రభుత్వం ఎటువంటి ధృవీకరణ ఇవ్వలేదు. సంబంధిత అధికారులు కూడా ఏం మాట్లాడలేదు. సంబంధిత షాపు యజమాని గడువు తేదీ దాటిన తర్వాత పాల విక్రయాలు చేసినట్లు మాత్రం తేలినట్లు కనిపిస్తోంది.
* 1992లో స్థాపన..
అయితే హెరిటేజ్ ఉత్పత్తులపై( Heritage products ) విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కావడంతో ఈ తరహా ఆరోపణలు రావడం సర్వసాధారణం. ప్రస్తుతం చంద్రబాబు కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలను చూస్తున్నారు. 1992లో చంద్రబాబు హెరిటేజ్ గ్రూపును స్థాపించారు.డెయిరీ, రిటైల్ విభాగాలతో ఈ సంస్థ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హెరిటేజ్ పాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్,పంజాబ్ లలో శరవేగంగా విస్తరించగలిగింది. ఒడిస్సాలో సైతం భారీ స్థాయిలో ఉత్పత్తులు విక్రయిస్తుంటారు. దీనికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖలో రిటైల్ స్టోర్ లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రి కార్యకలాపాలు చిత్తూరు, మెదక్ జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీలు ప్రచారం చేయడం ఇది తొలిసారి మాత్రం కాదు.
Also Read: ఈ స్టార్ హీరోయిన్ తొలి పారితోషకం కేవలం రూ.10.. ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్…ఎవరంటే..