Nara Brahmani: లెజెండ్ ఎన్టీఆర్ నటవారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ స్టార్ హీరో అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. బాలకృష్ణకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి. కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని పరిశ్రమకు రాలేదు. ఇటీవల తేజస్విని నిర్మాతగా మారారని సమాచారం.తమ్ముడు మోక్షజ్ఞ మూవీని ఆమె నిర్మిస్తున్నారట. ఇక పెద్దమ్మాయి బ్రాహ్మణి మొదటి నుండి బిజినెస్ ఉమన్ గా ఉన్నారు. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ తో పాటు పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బ్రాహ్మణికి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ అనే పేరుంది. ఇక బ్రాహ్మణికి బాలయ్య సినిమాలు అంటే చాలా ఇష్టం అట. ఆయన నటించిన ప్రతి సినిమాను ఫస్ట్ డే చూస్తుందట. నా సినిమాలను బ్రాహ్మణి అసలు వదలకుండా చూస్తుందని బాలయ్య ఒకటి రెండు సందర్భాల్లో వెల్లడించారు. కాగా బాలయ్యతో పాటు మరొక హీరో అంటే బ్రాహ్మణికి ఇష్టం అట. ఆయన జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటే పొరపాటే. బ్రాహ్మణికి చిరంజీవి అంటే కూడా చాలా ఇష్టం అట. చిరంజీవి డాన్సులు, డైలాగులు మెస్మరైజ్ చేస్తాయట. తండ్రి బాలయ్య కాకుండా ఆమెకు చిరంజీవి ఫేవరేట్ హీరో అట.
పరిశ్రమలో బాలయ్యకు ప్రధాన పోటీగా ఉన్న చిరంజీవిని బ్రాహ్మణి చాలా లైక్ చేస్తారట. అలాగే రామ్ చరణ్ కూడా తన ఫేవరెట్ హీరోల్లో ఒకరు అట. చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు తాను ఇష్టంగా చూస్తానని వెల్లడించారు. మరోవైపు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనిలో బాలయ్య నిమగ్నమయ్యాడు. డాకు మహారాజ్ విడుదలయ్యాక పూర్తి స్థాయిలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పై కసరత్తు చేసే అవకాశం ఉంది.
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ కూడా వదిలాడు. అయితే ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడిందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ భారీ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా అడుగుతున్నాడట. ప్రశాంత్ వర్మ తీరు బాలయ్యను ఆగ్రహానికి గురి చేసిందని టాలీవుడ్ టాక్. అయితే మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు నోట్ విడుదల చేశారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you know who is nara brahmani favorite hero
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com