Homeజాతీయ వార్తలుRaghav Chadha parliament speech: కేంద్రాన్ని పార్లమెంట్ లో చెడుగుడు ఆడేస్తున్న రాఘవ్ చద్దా.. ఈసారి...

Raghav Chadha parliament speech: కేంద్రాన్ని పార్లమెంట్ లో చెడుగుడు ఆడేస్తున్న రాఘవ్ చద్దా.. ఈసారి ’ఐటీ‘పై అటాక్

Raghav Chadha parliament speech: రాఘవ్‌ చద్దా.. ఇటీవల సోషల్‌ మీడియాలో మస్తు ట్రెండింగ్‌ అవుతున్న నేత. దేశంలో టెలికాం సంస్థల మోసాలను, ప్రభుత్వం ఎంపీలకు చెల్లిస్తున్న టెలిఫోన్‌ బిల్లు.. తదితర అంశాలను సభలో ప్రస్తావించి మోదీ, నిర్మలా సీతారామన్‌కు షాక్‌ ఇచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు, కేంద్రాన్ని వేసిన ప్రశ్నల వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు. తాజాగా యాన పెళ్లైన దంపతులకు జాయింట్‌ ఆదాయపు పన్ను ఫైలింగ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. […]

Raghav Chadha parliament speech: రాఘవ్‌ చద్దా.. ఇటీవల సోషల్‌ మీడియాలో మస్తు ట్రెండింగ్‌ అవుతున్న నేత. దేశంలో టెలికాం సంస్థల మోసాలను, ప్రభుత్వం ఎంపీలకు చెల్లిస్తున్న టెలిఫోన్‌ బిల్లు.. తదితర అంశాలను సభలో ప్రస్తావించి మోదీ, నిర్మలా సీతారామన్‌కు షాక్‌ ఇచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు, కేంద్రాన్ని వేసిన ప్రశ్నల వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు. తాజాగా యాన పెళ్లైన దంపతులకు జాయింట్‌ ఆదాయపు పన్ను ఫైలింగ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుత వ్యవస్థలో భార్యాభర్తలు విడివిడిగా పన్ను చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని విమర్శించారు. కుటుంబ ఆదాయాన్ని సమగ్రంగా పరిగణించి పన్ను స్లాబ్‌లను ఆప్టిమైజ్‌ చేయాలని సూచించారు.

ప్రస్తుత విధానంలో అన్యాయాలు
భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి విడిగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి. ఉదాహరణకు, ఇద్దరూ ఏడాదికి రూ.10 లక్షలు సంపాదిస్తే పూర్తి మినహాయింపు(ఆల్డ్‌ రెజిమ్‌లో) వల్ల పన్ను లేదు. కానీ ఒకరు రూ.20 లక్షలు సంపాదిస్తే 30% స్లాబ్‌లో రూ.1.92 లక్షలు పన్ను విధించబడుతుంది(సెస్‌తో సహా). ఇది ఆదాయం అసమాన పంపిణీ ఉన్న కుటుంబాలకు శిక్షలా పని చేస్తుంది. చద్దా ఈ లోపాన్ని హైలైట్‌ చేసి, కుటుంబ యూనిట్‌ను పరిగణించాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపాదిత మార్పులు..
జాయింట్‌ ఫైలింగ్‌ను ఐచ్ఛికంగా అందించాలని చద్దా పేర్కొన్నారు. దీనితో దంపతులు కలిపి ఆదాయాన్ని రిపోర్ట్‌ చేసి, తక్కువ స్లాబ్‌ల్లో పన్ను చెల్లించవచ్చు. అమెరికా, యురోపియన్‌ దేశాల్లో ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక్కడ కుటుంబ ఆదాయానికి డబుల్‌ మినహాయింపు, తక్కువ రేట్లు వర్తిస్తాయి. భారతదేశంలో ఇది అమలు చేస్తే మహిళల సంపాదన పెరిగిన కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది ఇప్పటికే విడిగా ఫైల్‌ చేస్తారు.

అమలులో సవాళ్లు..
అమలులో ఆదాయ ధృవీకరణ, విడాకులు, పొదుపు ఆస్తులపై స్పష్టమైన నిబంధనలు అవసరం. ఐటీ విభాగం సాంకేతికంగా సిద్ధంగా ఉంటే సులభం. కుటుంబాల ఆదాయ పెరుగుదల ప్రోత్సాహం, మహిళల ఉద్యోగాలు పెరగడం, పన్ను సర్కార్‌ రెవెన్యూ పెరగడం (ఎక్కువ ఫైలింగ్‌లు). ఈ ప్రతిపాదన బడ్జెట్‌ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుంది.

చద్దా ప్రతిపాదన ప్రభుత్వ ఆలోచనకు దారితీస్తే 2027 బడ్జెట్‌లో అమలు అవకాశం ఉంది. ఇది పన్ను వ్యవస్థను మరింత న్యాయవంతం చేస్తూ మధ్యతరగతి కుటుంబాలకు ఊరట.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper