spot_img
Homeక్రీడలుLucknow Super Giants 2026 : జట్టు నిండా హిట్ మాన్ లే.. లక్నో ఈసారి...

Lucknow Super Giants 2026 : జట్టు నిండా హిట్ మాన్ లే.. లక్నో ఈసారి అదరగొడుతుందా..

Lucknow Super Giants 2026 : ఐపీఎల్ లో అత్యంత ప్రమాదకరమైన జట్లలో లక్నో ఒకటి. ఈ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. కానీ కీలక దశలో ఈ జట్టు తేలిపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఈ జట్టు.. ఈసారి బలంగా కనిపిస్తోంది. మునుపటి కంటే ఎక్కువ ప్రతిభావంతమైన ప్లేయర్లను తీసుకొని.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది.

2022లో ఐపీఎల్ లో ప్రవేశించింది లక్నో. తొలి రెండు సీజన్లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. 2024 లో మాత్రం దారుణమైన ఆట తీరు ప్రదర్శించి.. ఏడవ స్థానానికి పరిమితమైంది. దీంతో మేనేజ్మెంట్ కెప్టెన్ రాహుల్ ను పక్కన పెట్టింది. గత ఏడాది ఏకంగా 27 కోట్లు ఖర్చుపెట్టి సారధిగా రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంది. అయితే పంత్ నాయకత్వంలో లక్నో జట్టు గత ఏడాది గొప్పగా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే అతని నాయకత్వం మీద మేనేజ్మెంట్ పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఈసారి గొప్ప ప్రదర్శన చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అనుభవజ్ఞుల రాకతో..

జోస్ ఇంగ్లిస్ జట్టులోకి రావడంతో బ్యాటింగ్ బలం పెరిగింది. షమీ, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. హస రంగ స్పిన్ విభాగంలో కీలకంగా కాబోతున్నాడు.. పూరన్, మార్ష్, రిషబ్ పంత్, బదోని, మార్క్రం వంటి వారితో బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు లోగోను కూడా పూర్తిగా మార్చేశారు.

జట్టు బలాలు

లక్నో జట్టులో మార్క్రం మార్ష్, ఇంగ్లిస్, పూరన్, పంత్ వంటి ప్లేయర్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇంగ్లిస్ జోరు చూపిస్తే.. పంత్ అదరగొడితే లక్నో జట్టుకు తిరుగులేదు. మిడిల్ ఆర్డర్లో పూరన్ అత్యంత కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. షమీ తన అనుభవాన్ని ఉపయోగిస్తే గనక జట్టు బౌలింగ్ విభాగంలో కూడా బలంగా ఉంటుంది. హసరంగ తనదైన రోజు వికెట్ల వేటను కొనసాగించగలడు…

బలహీనతలు

జట్టులో ప్రతిభావంతమైన ప్లేయర్లు ఉన్నారు. అయితే ఏదైనా సందర్భంలో ఎదురు దెబ్బ తగిలితే జట్టు మొత్తం కుప్పకూలే అవకాశం ఉంది. అందరూ దూకుడుగా బ్యాటింగ్ చేసేవారు కావడం.. సమయోచితంగా ఆడే ప్లేయర్లు లేకపోవడం లక్నో జట్టుకు పెద్ద మైనస్ పాయింట్. ఆటగాళ్లు ఒత్తిడి పూర్తిగా తగ్గించుకొని.. నిలదొక్కుకోవాలి. లోయర్ మిడిల్ ఆర్డర్ తన బాధ్యతను నిర్వర్తించాలి. ముఖ్యంగా షమీ.. మయాంక్ మీద పూర్తి ఆధార పడితే.. జట్టు పుట్టి మునుగక తప్పదు. ప్రత్యామ్నాయ బౌలర్లను సృష్టించుకోవాలి. అప్పుడే బౌలింగ్ విభాగం స్పష్టంగా ఉంటుంది.

గత రెండు సీజన్లో లక్నో జట్టు అంత గొప్పగా ఆడలేదు. అయితే ఈసారి బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే ప్లే ఆఫ్ దాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జట్టులో ప్లేయర్లు

ముకుల్ చౌదరి, రిషబ్ పంత్, పూరన్, ఇంగ్లిస్, మార్క్రం, హిమ్మత్ సింగ్, బ్రిడ్జ్ టెక్, రఘు వంశి, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్, బదోని, సమద్, కులకర్ణి, మార్ష్, హసరంగ, హెన్రిచ్, దిగ్వేష్ రాటి, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper