
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవానలి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.