
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని చెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని చెప్పారు.