Chiranjeevi Vishwambhara movie : గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. ఆయనకు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఇప్పుడున్న యంగ్ హీరోలతో పాటు పోటీ పడుతూ నటిస్తున్నాడు అంటే ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమో మన అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. రీసెంట్ గా ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన మరోసారి ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకులను అల్లరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవ్వబోతుందంటూ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా ఫైనల్ కాపీ మీద చిరంజీవి కొంతవరకు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ సినిమాలోని కొన్ని సీజీ షాట్స్ అలాగే వాటికి సంబంధించిన ఆ ఫ్లోని కరెక్ట్ గా ఉందా లేదా చూడడానికి చిరంజీవి టంగ్ డైరెక్టరైన ప్రశాంత్ వర్మను పిలిపించినట్టుగా తెలుస్తుంది.
ప్రశాంత్ వర్మ ఇంతకుముందు చేసిన ‘హనుమాన్’ సినిమాలో విఎఫ్ఎక్స్ ను చాలా బాగా వాడుకున్నాడు. అందువల్లే అతనికి ఒకసారి ఈ సినిమా అయితే చూపించారట. తను కొన్ని కరెక్షన్స్ చెప్పడంతో వాటిని చేంజ్ చేసే పనిలో సినిమా యూనిట్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వశిష్ట ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాడు.
ఆయన ఈ సినిమాతో ఏ రేంజ్ దర్శకుడిగా మారిపోతాడు చిరంజీవి టాప్ లెవెల్ కి వెళ్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు. ఇక విశ్వంభర సినిమా విషయంలో మాత్రమే ఆయన ఏదో ఒక అసంతృప్తితో ఉన్నాడు.
ఇక ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద పెద్దగా అంచనాలైతే లేవు…ఈ సినిమా రిలీజై వండర్స్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…