
దేశంలో 5జీ ట్రయల్స్ లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం పై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. 5 జీ ట్రయల్స లో చైనాకు చెందిన హువాయ్, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త అని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న అక్కడి టెక్ కంపెనీలకు దూరంగా ఉండాలని అమెరికా తన మిత్ర దేశాలకు మరోసారి పిలుపునిచ్చింది.